బలగం టీవీ, రాజన్న సిరిసిల్ల:
పరీక్షలు సమయం లో విద్యార్థులకు సమయానికి బస్సులు నడపాలని డిపో మేనేజర్ కి వినతి పత్రం అందించిన భారత రాష్ట్ర సమితి విభాగం రాష్ట్ర నాయకులు కంచర్ల రవి గౌడ్..
డిపో మేనేజర్ ఆర్టీసి సిరిసిల్ల కి విద్యార్థులకు ఎగ్జామ్స్ వున్నందున వారి కోసం ప్రత్యేక బస్సులు నడుపాలని తెలిపారు.
ఇంటర్ విద్యార్థులకు ఎగ్జామ్స్ వున్నందున వారి కోసం ఉదయం పూట మరియు ఎగ్జామ్ అయ్యాక విద్యార్థులు తమ ఇళ్లకు వెళ్ళడానికి వారి కోసం సమయానికి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయవలసిందిగా మిమ్మల్ని కోరడం జరుగుతుంది.అంతేకాకుండా మన జిల్లా వ్యాప్తంగా వున్న ప్రతి గ్రామాల్లో విద్యార్థులు కనపడితే బస్సును అపే విధంగా ప్రతి ఒక్క బస్సు డ్రైవర్ కి ఆపమని మి ద్వారా తెలియ చేయడం జరుగుతుంది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని విద్యార్ధుల బంగారు భవష్యత్తుకు కృషి చేయాలని వారి బంగారు బాటకు సహకరించాలని ఎగ్జామ్స్ వున్నన్ని రోజులు ప్రత్యేక బస్సులు వేయాలి అని భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం తరుపున మిమ్మల్ని విజ్ఞప్తి చేయడం జరుగుతుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో ముస్కామ్ అనిల్, కాసార్ల వినయ్, లక్ష్మణ్, తిరుపతి, శ్రీకాంత్, అక్షయ్, రాజు తదితరులు పాల్గొన్నారు.