బలగం టీవీ, రాజన్న సిరిసిల్ల:
మంగళవారం రోజున జిల్లా కలెక్టరేట్ కార్యాలయం లో జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా కి రాజన్న సిరిసిల్ల జిల్లా తెలంగాణ ఉద్యమకారుల పోరం జిల్లా కోఆర్డినేటర్ వెంగళ శ్రీనివాస్ వినతి పత్రం అందజేయడం జరిగింది.
ఈ సందర్భంగా వెంగళ శ్రీనివాస్ మాట్లాడుతూ, తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ చీమ శ్రీనివాస్ ఆదేశాల మేరకు ఈరోజు జిల్లా కలెక్టర్ కి ఈ ప్రభుత్వం ఎన్నికల ముందు మేనిఫెస్టోలో పెట్టిన విధంగా ఇచ్చిన హామీ ప్రకారం తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని వినతి పత్రం అందజేయడం జరిగిందన్నారు.
ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేసి తెలంగాణ ఉద్యమకారులను గుర్తించి గుర్తింపు కార్డులు జారీ చేయాలని అన్నారు. సంక్షేమ పథకాలలో ఇందిరమ్మ ఇండ్లలో రాజీవ్ యువ వికాస పథకంలో 20% శాతం తెలంగాణ ఉద్యమకారులకు కేటాయించాలని అన్నారు. తెలంగాణ ఉద్యమకారులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి 10,000 రూపాయల కోట్లు బడ్జెట్ కేటాయించాలని, తెలంగాణ రాష్ట్ర సాధకులుగా గౌరవించి నెలకు 25 వేల రూపాయల గౌరవ వేతనం ఇవ్వాలని, ఉద్యమకారులకు ప్రమాద బీమా ఐదు లక్షలు అందించి వారి కుటుంబాన్ని ఆదుకోవాలని ఉన్నారు.
ఈ కార్యక్రమంలో ఉద్యమ కళాకారుల విభాగం నాయకులు ఎల్ల పోశెట్టి, ఉద్యమకారుల ఫోరం జిల్లా నాయకులు బొజ్జ కనకయ్య, తెలంగాణ ఉద్యమకారుల ఫోరం నాయకులు వెంగళ వెంకటేశం, బొడ్డు రాములు, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

