బలగం టివి: రాజన్న సిరిసిల్ల:

రాజన్న సిరిసిల్ల జిల్లా కేటీఆర్ ఎమ్మెల్యేగా ప్రతినిధ్యం వహిస్తున్న తంగళ్లపల్లి మండల జడ్పీటీసీ పూర్మాణి మంజుల తో పాటు భర్త పూర్మాణి లింగారెడ్డి బీఆర్‌ఎస్‌కు రాజీనామా చేశారు. బీఆర్‌ఎస్ పార్టీ తరుపున తంగళ్లపల్లి మండలం జడ్పీటీసీగా రెండు సార్లు జడ్పీటీసీగా గెలిపొందారు. జడ్పీ చైర్ పర్సన్‌గా కూడా ప్రయత్నం చేసి భంగపడ్డారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం పోవడం.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నేపధ్యంలో తంగళ్లపల్లి జడ్పీటీసీ పూర్మాణి మంజుల బీఆర్‌ఎస్‌కు రాజీనామా చేయడం రాజకీయ చర్చకు దారి తీస్తుంది. సిరిసిల్ల బీఆర్‌ఎస్ నాయకులను ఖాళీ చేసి కాంగ్రెస్ లో చేర్పించుకునేందకు కాంగ్రెస్ అధినాయకత్వం ప్రణాళికలు సిద్దం చేసినట్లు తెలుస్తుంది. బీఆర్‌ఎస్‌కు రాజీనామా చేసిన జడ్పీటీసీ దంపతులు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఈ మేరకు రాజీనామా పత్రాన్ని విడుదల చేశారు. తనకు పార్టీలో గుర్తింపు ఇవ్వడం లేదని పేర్కొన్నారు.
