క్రీడా రంగంపై రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి..

0
43

– క్రీడల వైపు యువతను ప్రేరేపించేందుకు సీఎం కప్

  • ప్రభుత్వ విప్ అది శ్రీనివాస్

బలగం టీవీ, వేములవాడ:

క్రీడాల పట్ల మా ప్రభుత్వనికి ప్రత్యేక దృష్టి పెట్టిందని,తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్రీడల పట్ల చాలా మక్కువతో ఉన్నారని, ఒలంపిక్స్ లో మన రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహించేలా ముఖ్యమంత్రి క్రీడాకారులను ప్రోత్సహిస్తున్నారని ప్రభుత్వ విప్ అది శ్రీనివాస్ అన్నారు.

వేములవాడ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో రాజన్న సిరిసిల్ల వాలీబాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 8వ తెలంగాణ రాష్ట్ర స్థాయి యువతి–యువకుల యూత్ వాలీబాల్ పోటీలు నిర్వహించగా,రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై జ్యోతిప్రజ్వలన చేసి, ఒలింపిక్ జెండాను ఆవిష్కరించారు.

ఈ సందర్బంగా ప్రభుత్వ విప్ అది శ్రీనివాస్ మాట్లాడుతూ.. వాలీబాల్ ఆడటానికి వచ్చిన క్రీడాకారులకు స్వాగతం తెలుపుతున్న.. వాలీబాల్ అసోసియేషన్ వారు ఓ కార్యక్రమాల్లో పాల్గొన్న సందర్భంగా రాష్ట్ర స్థాయి వాలీబాల్ కబడ్డీ పోటీలను మన ప్రాంతంలో నిర్వహించలని అడుగా, వారికి ఇచ్చిన హామీ మేరకు నేడు రాష్ట్ర స్థాయి వాలీబాల్ పోటీలను వేములవాడ లో నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ ప్రాంతంలో రుద్రంగీ లో వాలీబాల్ క్రీడాకారులు ఉన్నారని, ఈ ప్రాంతం నుండి జాతీయ స్థాయిలో రాణించిన క్రీడాకారులు ఉన్నారని అన్నారు. కబడ్డీ లో సనుగుల, మూడపల్లి, నూకలమర్రి లాంటి గ్రామాల్లో అనేక మంది క్రీడాకారులు ఉన్నారని అన్నారు.గ్రామీణ ప్రాంతాల్లో క్రీడలు ముందుకు పోయేందుకు ప్రోత్సహిస్తున్నామని అన్నారు. ఈ వయస్సులో చెడు మార్గంలో కి పోకుండా క్రీడల వైపు యువత వెళ్లాలని,సీఎం రేవంత్ రెడ్డి క్రీడాకారుల కోసం సీఎం కప్ ఏర్పాటు చేశారని,గ్రామీణ ప్రాంతాల్లో మంచి నైపుణ్యం కలిగిన క్రీడాకారులను బయటకు తీసుకురావడమే సీఎం కప్ లక్ష్యం మని అన్నారు.సుమారు 45 కు పైగా క్రీడలను సీఎం కప్ క్రీడా పోటీలలో చేర్చడం జరిగిందని,గ్రామీణ మండల జిల్లా రాష్ట్రస్థాయిలో క్రీడాకారులను వెలికి తీస్తున్నామని అన్నారు.. గత ప్రభుత్వం 9 ఏళ్లుగా డైట్ చార్జీలు పెంచలేదు, కానీ కాంగ్రెస్ వచ్చాక డేట్ చార్జీలు 40 శాతం పెంచడం జరిగింది,యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటు కోసం స్థలం సేకరణ జరుగుతుందని అన్నారు.నూతన పాలకవర్గం అందరి మన్నలు పొందుతూ ముందుకు పోవాలని,వేములవాడ పట్టణంలో గత ప్రభుత్వం స్టేడియం నిర్మాణం పక్కన పెట్టారు,నేడు ప్రజా ప్రభుత్వంలో దాని పనులు ముమ్మరంగా జరుగుతున్నాయని అన్నారు. వేములవాడ పట్టణంలో త్వరలోనే 3 ఎకరాల్లో ఇండోర్ స్టేడియం నిర్మాణం చేపడతామని అన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ నాగుల సత్యనారాయణ, మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు, వైస్ చైర్మన్ నరాల శేఖర్, మార్కెట్ కమిటీ చైర్మన్ రోడి రాజు, రాష్ట్ర వాలీబాల్ అసోసియేషన్ అధ్యక్షులు గజ్జెల రమేష్ బాబు, రాష్ట్ర కార్యదర్శి హనుమంత రెడ్డి, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి గిన్నె లక్ష్మణ్, జిల్లా వాలీబాల్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీ కుమార్, ఉపాధ్యక్షులు కోళ్ల శ్రీనివాస్, జిల్లా కార్యదర్శి రాందాస్ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here