సిరిసిల్ల నియోజకవర్గంలో గులాబీ ప్రభంజనం: ప్రతిపక్షంలోనూ పట్టు నిలుపుకున్న బీఆర్ఎస్…

0
84

రెండవ విడత జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో 30 స్థానాలకు 20 సర్పంచ్ స్థానాలు గెల్చుకున్న బీఆర్ఎస్

  • ప్రతిపక్షంలో లోను పట్టునిలుపుకున్న బీఆర్ఎస్
  • సింగిల్ డిజిట్ కే పరిమితమైన అధికార కాంగ్రెస్ పార్టీ
  • 10 గ్రామాల్లో మూడవ స్థానంలో హస్తం పార్టీ
  • బండి సంజయ్ ప్రకటనను పట్టించుకోని పల్లెజనం…దరిదాపుల్లో కూడా లేని బీజేపీ

బలగం టీవీ, రాజన్న సిరిసిల్ల:

సిరిసిల్ల నియోజకవర్గంలో జరిగిన రెండవ విడత సర్పంచ్ ఎన్నికల్లో బీఆర్ఎస్ (BRS) పార్టీ అనూహ్య విజయాన్ని సాధించి గులాబీ ప్రభంజనం సృష్టించింది. ముఖ్యంగా, తంగళ్లపల్లి మండలంలో జరిగిన 30 స్థానాలకు గాను ఏకంగా 20 సర్పంచ్ స్థానాలను గెల్చుకుని, ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ తన పట్టును నిలుపుకుంది.

అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో నిరాశపరిచింది. ఆ పార్టీ సింగిల్ డిజిట్‌కే పరిమితమైంది. పదికి పైగా గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ మూడవ స్థానంలో నిలవడం గమనార్హం. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన రెండేళ్ల పాలనపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత ఈ సర్పంచ్ ఎన్నికల ఫలితాల్లో స్పష్టంగా ప్రతిబింబించిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

దరిదాపుల్లో కూడా లేని బీజేపీ..

కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రాతినిధ్యం వహిస్తున్న కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని సిరిసిల్లలో బీజేపీ కనీస పోటీ కూడా ఇవ్వలేకపోయింది. బీజేపీ అభ్యర్థిని గెలిపిస్తే అధిక నిధులు ఇస్తామని బండి సంజయ్ చేసిన ప్రకటనను పల్లె ప్రజలు పట్టించుకోలేదు. ఈ ఎన్నికల్లో 16 గ్రామాల్లో బీజేపీకి అభ్యర్థులు కూడా పోటీకి దొరక్కపోవడం విశేషం.

తంగళ్లపల్లి మండలంలో బీఆర్ఎస్‌కు వచ్చిన ఈ భారీ విజయం, మూడవ విడతలో ఈ నెల 17న జరగనున్న ముస్తాబాద్, ఎల్లారెడ్డిపేట, గంభీరావుపేట, వీర్నపల్లి మండలాల సర్పంచ్ ఎన్నికలపై ప్రభావం చూపనుంది. తాజా ఫలితాలతో బీఆర్ఎస్ శ్రేణులు ఉత్సాహంతో ఉండగా, మిగిలిన నాలుగు మండలాల్లో కూడా బీఆర్ఎస్ మద్దతుదారులు మెజార్టీ స్థానాలు గెలిచే అవకాశాలు మెరుగుపడ్డాయని పార్టీ నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here