బలగం టివి, రుద్రంగి:
ప్రభుత్వ ఉద్యోగం చాలా మంది కల.ఉద్యోగ సాధన కోసం చాల కష్టపడతారు.పగలు రాత్రి తేడా లేకండా గంటలు గంటలు పుస్తకాలతో కుస్తీ పడతారు. అయితే ఎంత కష్టపడి చదివినా.. సక్సెస్ అయ్యేది మాత్రం చాలా తక్కువ మందే. ఈ రోజుల్లో ఉన్న కాంపిటీషన్‌కు ఉద్యోగం రావటమంటే మాటలు కాదు. అలాంటి ఓ యువకడు తన ప్రభుత్వ ఉద్యోగ కలను నిజం చేసుకున్నాడు.. వివరాల్లోకి వెళితే రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రానికి చెందిన లింగంపల్లి రవి అనే యువకుడు బీపీఈడీ పూర్తి చేసి ప్రైవేటు పాఠశాలలో పిటీగా పనిచేస్తూ పోటీ పరీక్షలకు సిద్ధం అవుతున్నాడు..కాగా తెలంగాణ ప్రభుత్వం మంగళవారం విడుదల చేసిన గురుకుల టీచరు పోటీ పరీక్షల్లో పీడీ గా ప్రభుత్వ ఉద్యోగం సాధించి హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో గురువారం జరిగిన కార్యక్రమంలో నియామక పత్రాన్ని అందుకున్నాడు..నిరుపేద కుటుంబానికి చెందిన లింగంపల్లి రవి ప్రభుత్వ ఉద్యోగం సాధించడం పట్ల కుటుంబ సభ్యులు,బంధు మిత్రులు,గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు..