రైతుబంధు పథకం రాక తీవ్ర ఆవేదనలో బిజెపి సీనియర్ నాయకుడు
కాంగ్రెస్ పార్టీ నూతన సీఎంను వేడుకుంటున్న బిజెపి నాయకుడు
పలుమార్లు ఆత్మహత్య చేసుకుంటానని చెప్పిన పట్టించుకోని అధికారులు

ఎల్లారెడ్డిపేట
రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం చెందిన ఓ బిజెపి సీనియర్ నాయకుడుని బిఆర్ఎస్ ప్రభుత్వం తనని బ్రతికుండగానే చనిపోయినట్లు నిర్ధారించి రైతుబంధు ఇంతవరకు ఇవ్వలేదని బిజెపి పార్టీ సీనియర్ నాయకుడు మంగళవారం ముద్ర రిపోర్టర్ తో చెబుతూ ఆవేదన వ్యక్తం చేశాడు.మండల కేంద్రానికి చెందిన నేవూరి దేవేందర్ రెడ్డి కి మండల కేంద్రంలో మూడు ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నది.అందరిలాగే తనకు కూడా రైతుబంధు ఇచ్చినట్లే ఇచ్చి బ్యాంకులో ఉన్న రుణాన్ని రైతుబంధు ద్వారా పొందలేకపోయాడు.పలుమార్లు అధికారుల చుట్టూ తిరిగిన ఫలితం లేకపోవడంతో ఆత్మహత్య చేసుకుంటానని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. స్థానిక గ్రామపంచాయతీ పంచాయతీ పంచాయతీ కార్యదర్శి వద్దకు వెళ్లి నివాస సర్టిఫికెట్ తీసుకెళ్లి బ్యాంకు అధికారులకు ఇచ్చిన కూడా అధికారులు ఇటు నాయకులు పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశాడు.తనకు రావాల్సిన 84వేల రూపాయల రైతుబంధు రాలేదని పలుమార్లు బ్యాంకు అధికారుల చుట్టూ తిరిగిన ఫలితం లేకపోగా బ్యాంకు అధికారులు తను చనిపోయినట్లు రికార్డులో తెలిపారని ఆవేదన వ్యక్తం చేశాడు. కాంగ్రెస్ ప్రభుత్వ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కు సోషల్ మీడియా ద్వారా తనకు రావాల్సిన 84 వేల రూపాయల రైతుబంధు ఇప్పించాలని పత్రిక ముఖంగా వేడుకున్నాడు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు చొరవ తీసుకొని దేవేందర్ రెడ్డి కి రావాల్సిన రైతుబంధును ఇచ్చి ఆయన కుటుంబానికి అండగా నిలవాలని స్థానిక రైతులు తెలిపారు.
