బలగం టీవీ, రాజన్న సిరిసిల్ల:

జక్కాపూర్ లో రంగనాయక సాగర్ కాలువను పరిశీలించిన రంగనాయక సాగర్ ఎస్ ఈ రవీందర్, అధికారులు
నిన్నటి రోజున మాజీ మంత్రి కేటీఆర్ ను రంగనాయక సాగర్ నుంచి నీళ్లు ఇప్పియ్యాలని తంగళ్ళపల్లి మండలంలోని జిల్లెల్ల, నేరెళ్ళ, చిన్నలింగాపూర్, రామచంద్రపురం,దాచారం రైతులు కోరిన విషయం తెలిసిందే,కేటీఆర్ ఎస్ ఈ తో పోన్ లో మాట్లాడి, నీళ్లు అందివ్వాలని సూచించారు.

దీంతో సోమవారం జక్కాపూర్ లోని రంగనాయక సాగర్ కాల్వను ఎస్ ఈ రవీందర్,అధికారులు సందర్శించారు. ఈ కాలువను పరిశీలించి, నీటి సరఫరా అందిస్తామని, నీటి ఫ్లో కూడా పెంచుతామని తంగళ్ళపల్లి మండల రైతులు తో పేర్కొన్నారు.
