వైద్య అధికారులు
బలగం టీవీ, రాజన్న సిరిసిల్ల:
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో ఫిబ్రవరి మరియు మార్చి (2026) నెలలకు సంబంధించి ‘సదరం’ (SADAREM) శిబిరాల నిర్వహణ తేదీలను వైద్య అధికారులు ఖరారు చేశారు. వివిధ రకాల వైకల్యాలు కలిగిన వారి కోసం ప్రత్యేక విభాగాల వారీగా ఈ క్యాంపులు నిర్వహించబడతాయి.
సంబంధిత మండల అభివృద్ధి అధికారులు (MPDOs), సిరిసిల్ల మరియు వేములవాడ మున్సిపల్ కమిషనర్లు ఈ సమాచారాన్ని ప్రజలకు చేరవేసి, దివ్యాంగులు ఈ అవకాశాన్ని వినియోగించుకునేలా చూడాలని కోరడమైనది.
| క్రమ సంఖ్య | క్యాంపు తేదీ | విభాగము |
| 1 | 26.02.2026 (గురువారం) | కంటిచూపు – 22 |
| 2 | 05.03.2026 (గురువారం) | వినికిడి – 32 |
| 3 | 05.03.2026 (గురువారం) | జనరల్ – 02 |
| 4 | 10.03.2026 (మంగళవారం) | మానసిక వైకల్యం – 20 |
| 5 | 12.03.2026 (గురువారం) | ఆర్థోపెడిక్ – 35 |
| 6 | 13.03.2026 (శుక్రవారం) | ఆర్థోపెడిక్ – 35 |
| 7 | 16.03.2026 (సోమవారం) | ఆర్థోపెడిక్ – 35 |
పైన తెలిపిన తేదిలలో సదరం శిభిరంకు హాజరగు దివ్యాంగులు సంబందిత మెడికల్ డాక్యుమెంట్లు, ఎక్స్ –రే మరియు UDID అప్లికేషన్ ఫామ్, ఆధార్ కార్డ్, పాస్ పోర్ట్ సైజ్ ఫోటో, ఫోన్ నెంబర్ తమ వెంట తీసుకుని ఉదయం 09.00 గంటలకు సదరం శిభిరంకు హాజరు కాగలరని తెలియజేయుచున్నాము.