సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రిలో ఈ నెల 21 నుండి ‘సదరం’ శిబిరాలు

0
737

బలగం టీవీ, రాజన్న సిరిసిల్ల:

రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ హాస్పిటల్‌లో ఈనెల (జనవరి-2026)లో వివిధ రకాల వైకల్యాలు ఉన్న వారి కోసం ‘సదరం’ (SADAREM) వైద్య శిబిరాలు నిర్వహించనున్నట్లు అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. సంబంధిత వైద్య నిపుణుల సూచనల మేరకు ఆయా విభాగాలకు నిర్దేశించిన తేదీలలో ఈ శిబిరాలు జరగనున్నాయి

శిబిరాల వివరాలు:

క్రమసంఖ్యక్యాంపు తేదీవిభాగం
121.01.2026 (బుధవారం)మానసిక వైకల్యం – 13
221.01.2026 (బుధవారం)వినికిడి లోపం – 13
322.01.2026 (గురువారం)జనరల్ వైకల్యాలు – 06
428.01.2026 (బుధవారం)ఆర్థోపెడిక్ (ఎముకల సంబంధిత) – 35
529.01.2026 (గురువారం)కంటిచూపు సమస్యలు – 15

శిబిరానికి హాజరయ్యే దివ్యాంగులు వైద్య ధృవీకరణ పత్రాలు (Medical Documents) మరియు ఎక్స్-రే (X-Ray), UDID అప్లికేషన్ ఫామ్, ఆధార్ కార్డు ఒరిజినల్ మరియు జిరాక్స్, పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు, ఫోన్ నెంబర్ వీటిని వెంట తీసుకుని అర్హులైన వారు పైన పేర్కొన్న తేదీలలో ఉదయం 09:00 గంటలకు ఆసుపత్రికి చేరుకోవాలని సూచించారు.

ఈ సమాచారాన్ని మండల అభివృద్ధి అధికారులు (MPDOs) మరియు సిరిసిల్ల, వేములవాడ మున్సిపల్ కమిషనర్లు తమ పరిధిలోని ప్రజలకు చేరవేసి అవగాహన కల్పించాలని కోరారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here