బలగం టివి, తంగళ్ళపల్లి
రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం మండేపల్లి గ్రామంలో నూతనంగా శ్రీ సమ్మక్క సారక్క విగ్రహ ప్రతిష్ట చేపట్టారు. అనంతరం హోమాలు నిర్వహించి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈనెల 22,23,24 తేదీలలో సమ్మక్క సారలమ్మ పండగను ఘనంగా నిర్వహిస్తామని, వివిధ గ్రామాల ప్రజలు భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యి అమ్మవారి ఆశీర్వాదాలు తీసుకోవాలని కమిటీ సభ్యులు తెలియజేశారు.