బలగం టీవీ, వేములవాడ:
వేములవాడ ఆలయ పరిసరాల్లో రెండవ రోజు పారిశుద్ధ్య పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఆలయ ప్రాంగణంలో ఉన్న విఐపి రోడ్డు, చెరువు ప్రాంతాల్లో పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని తొలగించే పనులను ఆలయ సిబ్బంది, మున్సిపల్ సిబ్బంది సమన్వయంతో చేపట్టారు.
రాబోయే రోజుల్లో సమ్మక్క సారక్క అమ్మవార్ల జాతరకు భారీగా భక్తులు తరలివచ్చే అవకాశముండటంతో, వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించారు. చెరువు పరిసరాలు, రహదారులు, ఆలయ ప్రాంగణాన్ని శుభ్రంగా ఉంచుతూ సానిటేషన్ మెరుగుపరిచే చర్యలు చేపడుతున్నారు. అలాగే భక్తుల సౌకర్యార్థం క్యూ లైన్లలో లైటింగ్ కలర్స్‌తో కూడిన విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయడం, రాత్రి వేళల్లో కూడా ఎలాంటి అసౌకర్యం లేకుండా ఏర్పాట్లు చేస్తున్నారు.
భక్తులు శుభ్రమైన, సౌకర్యవంతమైన వాతావరణంలో స్వామివారి దర్శనం చేసుకునేలా అన్ని విధాల ఏర్పాట్లు చేస్తున్నామని ఆలయ అధికారులు తెలిపారు.


