బలగం టివి, సిరిసిల్ల
మహానీయుడు సంతు సెవాలాల్..
సంతు సేవాలాల్ జ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలి.
ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్..
త్యాగాలకు మారుపేరు సంత్ సేవాలాల్ మహారాజ్. సేవాలాల్ జీవిత చరిత్రను భావితరాలకు తెలియ చెప్పాల్సిన అవసరం ఉందని, సంతు సేవాలాల్ జ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలని ప్రభుత్వ విప్. వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బంజారాల ఆరాధ్య దైవమైన సేవాలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాలను నిర్వహించారు,ఈ కార్యక్రమానికి ముఖ్య అతధిగా పు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ హజరైయ్యారు.గిరిజనలందరికీ సంతు సేవాలాల్ జయంతి శుభాకాంక్షలు తెలిపారు.. ఈ సందర్బంగా ప్రభుత్వ విప్ అది శ్రీనివాస్ మాట్లాడుతూ గిరిజనుల అభివృద్ధి కోసం సంతు సేవాలాల్ మహారాజ్ ఎంతో కృషి చేసినారు అని,గిరిజన ఆరాధ్య దైవం సేవాలాల్ మహారాజ్ అని అన్నారు. గిరిజనులు సంత్ సేవాలాల్ ఆశయాలను కొనసాగించాలని ప్రతి ఒక్కరూ సంతు సేవాలాల్ జ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలని తెలిపారు. సేవాలాల్ జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం సంతోషకరమైన విషయమని ,రాష్ట్ర ప్రభుత్వం గిరిజన అభివృద్ధికి పెద్దపీట వేస్తుందని అన్నారు.సంతు సేవాలాల్ మహారాజ్ ఆలోచన విధానాన్ని స్వీకరించి వారి అడుగుజాడల్లో ముందుకు నడవాలని ,ప్రభుత్వం పక్షాన గిరిజనుల హక్కులను కపడుతామాని అన్నారు.. 1976లో నాటి ప్రధాని ఇందిర గాంధీ బంజా రాలను ఎస్టీ జాబితాలో చేర్చడం వల్లే, గిరిజన సామాజిక వర్గం నుంచి చదువుకున్న ఎంతో మంది నేడు ఉన్నత స్థానాల్లో ఉన్నారని అన్నారు. తండాల్లో బీటీ రోడ్లు, తాగునీరు, విద్యుత్తు వసతులు కల్పిస్తామని, పంచాయతీ భవనాల నిర్మాణం చేపడ తామని. గత ప్రభుత్వం ఆరువేల ఏకో పాద్యాయ పాఠశాలలను మూసివేసిందని, తమ ప్రభుత్వం ప్రతి తండాలో పాఠశాలను ప్రారంభిస్తుం దనిఅన్నారు. అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఓబీసీ విద్యార్ధుల కోసం 20 ఎక రాల్లో విశ్వవిద్యాలయం తరహాలో పాఠశాలల భవ నాలు నిర్మిస్తామని సిఎం రెవంత్ రెడ్డి హామి ఇచ్చారనీ అన్నారు. గిరిజన ప్రాంతాల్లోఉండే ప్రతి విద్యార్థి సంత్ సేవాలాల్ మార్గంలో నడవాలనీ , ఎప్పుడు ఏ సమస్య వచ్చిన వెంటనే తమ దృష్టికి తీసుకురావాలన్నారు.