బలగం టీవీ, బోయినిపల్లి:
రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం నీలోజిపల్లి సర్పంచ్ అభ్యర్థి అనుముల భాస్కర్ ప్రచారంలో దూసుకుపోతున్నాడు. గ్రామ ప్రజలతో, సన్నిహితులతో, యువకులతో, మహిళలతో కలిసి సోమవారం రోజున ఇంటింటి ప్రచారం నిర్వహించి, తను చేయబోయే అభివృద్ధి పనులను వివరించి, ఈ నెల 14న జరిగే సర్పంచ్ ఎన్నికల్లో తన గుర్తు అయిన ఉంగరం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను వేడుకున్నాడు. నీలోజిపల్లి గ్రామాన్ని అభివృద్ధి చేయాలంటే తనను గెలిపించాలని ఓటర్లను కోరుతున్నారు. ఇంటింటి ప్రచారంలో భాగంగా ప్రతి ఓటరు దగ్గరకు వెళ్లి ఉంగరం గుర్తుపై ఓటు వేసి,తనను గెలిపిస్తే ముంపు గ్రామాల సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. నీలోజిపల్లి గ్రామాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతానని, ఎవరికి ఏ సమస్య వచ్చినా వెన్నంటుంటానని అన్నారు. ప్రధాన సమస్య అయిన ఐదు లక్షల 4 వేల రూపాయలు ఇప్పించేలా కృషి చేస్తానని అన్నారు. అలాగే ఆలయాల అభివృద్ధి, పార్కు తదితర సమస్యలను గెలిచిన వెంటనే పరిష్కరిస్తానని, ఎవరి మాయమాటలకు నమ్మి మోసపోవద్దని హోటర్లకు తెలిపారు.సర్పంచ్ తో పాటు వార్డు సభ్యులను భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. అనుముల భాస్కర్ తో ప్రచారానికి యువత మహిళలు భారీ సంఖ్యలో వచ్చి ఆయన గెలుపుకు కృషి చేస్తున్నారు.

