అయ్యప్ప స్వామి గుడి బోర్‌వెల్‌ను ప్రారంభించిన సర్పంచ్ ఎం.రాజు

0
183

బలగం టీవీ, ఇల్లంతకుంట:

ఇల్లంతకుంట మండల కేంద్రంలోని అయ్యప్ప స్వామి దేవాలయం ప్రాంగణంలో భక్తుల, స్థానిక ప్రజల తాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని నూతనంగా ఏర్పాటు చేసిన బోర్‌వెల్‌కు మోటార్ అమర్చి గ్రామ సర్పంచ్ ఎం. రాజు కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు.

ఈ సందర్భంగా సర్పంచ్ ఎం. రాజు మాట్లాడుతూ.. దేవాలయానికి వచ్చే భక్తులకు తాగునీటి సౌకర్యం కల్పించడం గ్రామపంచాయతీ ప్రాధాన్యత కింద చేపట్టిన కార్యక్రమమని తెలిపారు. గ్రామ అభివృద్ధి దిశగా మరిన్ని మౌలిక వసతుల ఏర్పాటుకు కృషి చేస్తామని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్, గ్రామ పురోహితులు మూగు నాగరాజు శర్మ, యువజన సంఘాల అధ్యక్షులు రేగుల కార్తీక్, వార్డు సభ్యులు రాకం సుమన్, అంతటి శ్రీకాంత్, నాయకులు ఎర్రోజు గోపాల చారి, మోహన్ రెడ్డి, కొట్టె వెంకటి, ముంజ భూపతి, యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ఎర్రోజు సంతోష్, యాస నిఖిల్, కారోబర్ నర్సయ్య, రామచంద్రం, బాబు, చంద్ పాషా, దేవాలయ కమిటీ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here