బలగం టీవీ, ఇల్లంతకుంట:
సిరిసిల్ల నుండి వెలిజిపూర్ మీదుగా ఇల్లంతకుంటకు నూతన బస్సు సేవలను మానకొండూరు శాసనసభ్యులు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ సహకారంతో బస్సు సేవలను గ్రామ ప్రజలందరితో కలిసి ప్రారంభించినట్లు గ్రామ సర్పంచ్ నాయిని నవీన్ కుమార్ తెలిపారు.
ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ బస్సు సేవలను గ్రామ ప్రజలు వినియోగించి ఆక్యుపెన్సిని పెంచాలని కోరారు. గ్రామ ప్రజలు ఎమ్మెల్యే సత్యనారాయణ కు కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్_ గుండ వెంకటేశం, గ్రామ శాఖ _అధ్యక్షులు గొల్లకోమటి శంకర్ యాదవ్ గారు, సీనియర్ నాయకులు మూల బాల్ రెడ్డి, బొల్లారం పరశురాములు గారు, వార్డ్ మెంబర్లు బోజ్జ శ్రీనివాస్, దేశెట్టి కవిత సంగేపు ముత్తవ్వ, వేములవాడ భారతి, బొల్లారం ప్రసన్నకుమార్ మరియు తదితర కాంగ్రెస్ పార్టీ నాయకులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు
