ఇల్లంతకుంట మండలం పెద్దలింగాపూర్ గ్రామంలో స్థానిక సర్పంచ్ శ్రీ గొడిశెల జితెందర్ గౌడ్ గారు చాకలి అయిలమ్మ విగ్రహానికి భూమి పూజ చేసినారు..
అనంతరం జితెందర్ గౌడ్ గారు మాట్లాడుతూ తెలంగాణ రైతంగ సాయుధ పోరులో భూమి కోసం, భూక్తి కోసం,వెట్టి చాకిరి విముక్తి కోసం మీరు చూపిన తెగువ తెలంగాణ మహిళ పౌరుషానికి, ఆత్మగౌరవానికి ప్రతీక,ఉవెత్తున సాగిన తొలి,మలి తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తి అని అన్నారు.. సంఘం ఇచ్చిన ధైర్యంతో
ప్రపంచ పుస్తకంలో పాఠమైన
పోరుబిడ్డ చాకలి అయిలమ్మ అని అన్నారు.ఆమే పోరాటం లక్షలాది ఎకారల
భూమి పంపాకానికి ఊతమిచ్చిందని అన్నారు.
ఆమే పోరాటమే వెట్టిని తరిమి కొట్టిందని గడీలను బూజు పట్టించిందని ఆమె ఎత్తిన పోరాట జెండా బానిస బతుకులను
విముక్తి చేసిందని అన్నారు.ఉ కార్యక్రంలో కుల సంఘం సభ్యులు ,గ్రామ ప్రజలు పాల్గొన్నారు..