బలగం టీవి ..రాజన్న సిరిసిల్ల
ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో అంబేడ్కర్ విగ్రహం వద్ద భారతదేశ మొట్టమొదటి మహిళ ఉపాధ్యాయురాలు , మహిళాల హక్కులే మానవ హక్కులుగా నినాదించిన మహోన్నత వ్యక్తి ,రెండు దశాబ్దాల క్రితమే మహిళల విద్య కోసం పాటుపడిన మాతృమూర్తి, తన ప్రాణాలు సైతం ఫణంగా పెట్టి ప్రజలనువిద్య వైపు నడిపిస్తూ చైతన్యవంతులుగా తీర్చిదిద్ది సామాజిక సేవ చేసిన గొప్ప మహాత్మురాలు సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలను జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది .ఇట్టి కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు వర్దవెల్లి స్వామి గౌడ్ , ప్రధాన కార్యదర్శి బొడ్డు మహేందర్, ఉపాధ్యక్షులు గుగులోత్ చంద్రు నాయక్ , ఇసి మెంబర్ అరుకల రమేష్ , పట్టణ అధ్యక్షలు తడుక భాను,అంజన్న ,తంగాల్లపల్లి మండల అధ్యక్షులు గుండు ప్రేమ్ కుమార్, ఏళ్లరెడ్డిపేట మండల అధ్యక్షలు నీరతి భాను , భాస్కర్ ,సందీప్, సతీష్ ,వేణు , అరుణ్ , తదితరులు పాల్గొనడం జరిగింది.