బలగం టీవి….బహ్రెయిన్
ఈరోజు తేదీ 03/01/2024 బుధవారం రోజున బిఎస్పీ భీమా సేనా బహ్రెయిన్ శాఖ ఆధ్వర్యంలో మహిళలకు చదువు నేర్పిన మొట్ట మొదటి మహిళ ఉపాధ్యాయురాలు చదువులతల్లి సావిత్రిబాయి ఫూలే 193వ జయంతి ఘనంగా నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా మాట్లాడుతూ సావిత్రిబాయి ఫూలే గారు మనువాద సవర్ణులు చేసిన దాడులను తట్టుకొని, ఎన్నో అవమానాలను ఎదుర్కొని, మహిళలు చదువుకుంటేనే పురుషులతో సమానంగా అన్నిరంగాల్లో ముందుకు వెళ్తారని, మొట్టమొదటి సారిగా మహిళలకు చదువు చెప్పిన మహనీయురాలు మన భారతదేశ నిజమైన చదువుల సావిత్రి భాయి ఫూలే.
ఆ మహనీయురాలు గురించి ప్రతిఒక్కరు తప్పకుండా తెలుసుకోవాలి.
మరి ముఖ్యంగా మహిళలు సావిత్రి భాయి ఫూలే గారి గొప్పతనం గురించి తెలుసుకొని, ఆ మహనీయురాలి ఆశయాలను ఆచరణలో పెట్టాలని మాట్లాడుకోవడం జరిగింది.
ఇట్టి కార్యక్రమంలో
అధ్యక్షులు :- జై భీమ్ చంద్రశేఖర్ గారు
గౌరవ అధ్యక్షులు :- జై భీమ్ అంజిగారు
వైస్ ప్రెసిడెంట్ :- అనిల్ కుమార్ గారు
కోశాధికారి :- జై భీమ్ జాని
కార్యదర్శి :- జై భీమ్ విజయ్ గారు
సభ్యులు :- శ్రీకాంత్, ఆనంద్, రమేష్ పాల్గొన్నారు
