బలగం టీవి .., ఎల్లారెడ్డిపేట
చదువుద్వారానే సమాజం మారుతుందనీ,పురోగతి సాధిస్తుందని,అలాంటి చదువును బోధించి ఎంతోమందిని చైతన్యం చేసిన ఉపాధ్యాయురాలు సావిత్రిబాయిపూలేగారనీ నేటి విద్యార్థులు,యువత స్ఫూర్తిగా తీసుకోవాలనీ ఇంచార్జి ప్రిన్సిపాల్ క్యాతం సత్యనారాయణ
బుధవారం రోజున ప్రభుత్వ జూనియర్ కళాశాల యెల్లారెడ్డిపేటలో జాతీయ సేవా పథకం & సాంస్కృతిక విభాగం ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే జయంతిని నిర్వహించారు.సావిత్రిబాయి పూలే ఫోటోకు పూలే అలంకరణ చేశారు.ఈసందర్భంగా జాతీయ సేవా పథకం ప్రోగ్రామ్ అధికారి వాసరవేణి పర్శరాములు మాట్లాడుతూ సావిత్రిబాయి పూలే 1831 జనవరి 3న మహారాష్ట్ర స్థాయిలో జన్మించారనీ జ్యోతిరావు పూలే తో వివాహం జరిగిందనీ, భర్త అడుగుజాడల్లో సామాజిక అక్షర చైతన్యం కోసం కృషి చేశారన్నారు. ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నారనీ అయినా వెనుకడుగు వేయకుండా ఎంతోమంది మహిళలకు చదువు చెప్పారని, అనేక పాఠశాలలు ఏర్పాటు చేసి విద్యావ్యాప్తికి ఎనలేని కృషి చేశారన్నారు. సావిత్రిబాయి పూలే “కాశీ” భవన్ సుబోధిని రత్నాకర్ ” పుస్తకాలు, గో, విద్యను పొందండి కవితలు రాశారని, 20కి పైగా పాఠశాలలు స్థాపించి విద్యాబోధన చేసి అణగారిన జీవితాల్లో జ్ణాన వెలుగులు నింపారనీ, సత్యశోధక్ సంస్థ ను స్థాపించారనీ అన్నారు . ప్లేగు వ్యాధిగ్రస్తులకు సేవ చేశారని చివరకు ప్లేగు వ్యాధితో 10 మార్చి 1897లోపరమపదించారనీ,మొదటి ఉపాధ్యాయురాలనీ తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఇంచార్జి ప్రిన్సిపాల్ క్యాతం సత్యనారాయణ, ఎన్.ఎస్.ఎస్ ప్రోగ్రామ్ అధికారి వాసరవేణి పర్శరాములు, మాదాసు చంద్రమౌళి, చెరుకు భూమక్క, బుట్ట కవిత, నీరటి విష్ణు ప్రసాద్, ఆర్.గీత, ఎ.గౌతమీ, కొడిముంజ సాగర్, చిలుక ప్రవళిక, బోధనేతర సిబ్బంది విమల్ కుమార్, కె.దేవేందర్, ఎం.డి తాజోద్దిన్, మరియు లక్ష్మీ తదితరులు వాలంటీర్లు విద్యార్థులు పాల్గొన్నారు.