బలగం టీవీ, రాజన్న సిరిసిల్ల :
కమిషనర్ ఆఫ్ ఫ్యామిలీ హెల్త్ హైదరాబాద్ తెలంగాణ వారి ఆదేశాల మేరకు 6-3-2025 రోజున తెలంగాణ రాష్ట్ర ప్రోగ్రాం ఆఫీసర్ మాతా శిశు సంరక్షణ అధికారి డాక్టర్ సూర్యశ్రీ రావు అధ్యక్షతన సిరిసిల్ల పట్టణంలో గల స్కానింగ్ సెంటర్లను ఆకస్మికంగా తనిఖీ చేసినారు.

రేడియాలజిస్ట్ మరియు గైనకాలజిస్ట్ డాక్టర్లు తెలంగాణ మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ కావాల్సిందిగా, లింగ నిర్ధారణ నిషేధిత చట్టం స్పెషల్ డ్రైవ్ కార్యక్రమం లో భాగంగా స్కానింగ్ సెంటర్ లను తనిఖీ నిర్వహించినారు.ఈ తనిఖీలలో రికార్డులను, ఫారం ఎఫ్ లు సరిగా నిర్వర్తించవలసిందిగా సూచించినారు.
ఈ తనిఖీ కార్యక్రమంలో గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ గైనకాలజిస్ట్ డాక్టర్ సుచిత్ర లక్ష్మి, జిల్లా పిఓఎంహెచ్ఎన్ ఇన్చార్జ్ డాక్టర్ సంపత్ కుమార్, సఖి కన్సల్టెంట్ రోజా, శ్రీలత పోలీస్ కానిస్టేబుల్, డిప్యూటీ డెమో రాజ్ కుమార్, హెచ్ ఈ బాలయ్య, డాటా ఎంట్రీ ఆపరేటర్ మహేష్ లు పాల్గొన్నారు.
