- కలెక్టర్ గరిమ అగ్రవాల్
బలగం టీవీ, రాజన్న సిరిసిల్ల :
మత్స్య కార్మికులకు ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వం పథకాలు అమలు చేస్తున్నదని కలెక్టర్ గరిమ అగ్రవాల్ తెలిపారు. నేషనల్ ఆగ్రో ఫౌండేషన్ ఆద్వర్యంలో బోయినపల్లి మండలం నర్సింగాపూర్ గ్రామంలో రూ. 8 లక్షల 91 వేలతో మంచినీటి చేప పిల్లల ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేయగా, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కలెక్టర్ గరిమ అగ్రవాల్ హాజరై, అడిషనల్ డైరెక్టర్ ఆఫ్ ఫిషరీస్ శ్రీనివాస్, ఎన్ ఎఫ్ డీబీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎస్ కన్నప్ప, నేషనల్ ఆగ్రో ఫౌండేషన్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ ఎస్వీ మురుగన్, జిల్లా మత్స్య అధికారి సౌజన్యతో కలిసి ప్రారంభించారు.
చేప పిల్లల పెంపకం చేసే యూనిట్ ను ప్రారంభించారు. చేప పిల్లల ఉత్పత్తి వివరాలు అడిగి తెలుసుకున్నారు. మత్స్య పారిశ్రామిక సహకార సంఘం సభ్యులకు చేప పిల్లలకు వేసే దాణా, మందులు, చేపల వేటలో వినియోగించే వలలు, పరికరాలు పంపిణీ చేశారు. అనంతరం మొక్కలు నాటారు.
ఈ సందర్భంగా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ.. మంచినీటి చేప పిల్లల ఉత్పత్తి కేంద్రాన్ని మత్స్య పారిశ్రామిక సహకార సంఘం సభ్యులు సద్వినియోగం చేసుకోవాలని పిలుపు నిచ్చారు. ఉపాధి పొందేందుకు ఎంతో ఉపయోగ పడుతుందని వివరించారు. ఆర్థికంగా బలపడాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా మత్స్య సహకార సంఘం ప్రెసిడెంట్ చొప్పరి రాంచంద్రం, అధికారులు ప్రకాష్ ముత్తు, సునీల్ కుమార్, విద్యాసాగర్ రెడ్డి, రామచంద్రన్, మత్స్య పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షులు, సంఘం సభ్యులు పాల్గొన్నారు.
