బలగం టివీ, తంగళ్లపల్లి:
రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం మండేపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్వయం పరిపాలనా దినోత్సవం నిర్వహించారు.నేటి బాలలే రేపటి పౌరులు అని పాఠశాలల్లో పరిపాలన బాధ్యతలు బాలలకు ఉపాధ్యాయులుగా బాధ్యతలు అప్పగించారు. విద్యార్థులు ఉపాధ్యాయులుగా బాధ్యతలు స్వీకరించి బాధ్యతలు చేపట్టారు. ఉపాధ్యాయ వృత్తి అనునది గౌరవపదమైనదని తెలియజేశారు. దీనిలో ప్రధానోపాధ్యాయులుగా సంజయ్, డీఈవో లాస్వికా పాల్గొన్నారు. ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు కార్యక్రమంలో పాల్గొన్నారు.