బలగం టీవీ, ఎల్లారెడ్డిపేట :
ఎల్లారెడ్డిపేట్ మండలం ఆల్మస్ఫూర్ గ్రామ లో గల ప్రైమరీ స్కూల్ విద్యార్థి చిన్నారులకు స్కూల్ బెల్ట్స్ మరియు టై లు ఈరోజు ఆ గ్రామానికి చెందిన సింగరవేణి కృష్ణ హరి అందించడం జరిగింది. వారు మాట్లాడుతూ ముందుగా ఇవ్వన్నీ అందించిన జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శి రెడ్డబోయిన గోపి కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు తాము చదుకున్న రోజులును గుర్తు చేస్కుంటూ జీవితం లో ఉన్నత విద్యను అభ్యసించి మంచి భవిష్యత్తుకు బాటలు వేయాలని క్రమ శిక్షణ తో ముందుకు వెళ్లాలని ఉద్దేశించడం జరిగింది రాబోవు రోజుల్లో పిల్లలకు మరిన్ని వాళ్ళ అవసరాల రీత్యా అందిస్తాం అని వారు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ప్రైమరీ ప్రాధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు గ్రామానికి చెందిన చందు బద్దుల శ్రీనివాస్ పెద్దవేణి బాబు మొగులోజి చంద్రం నరేష్ ఉత్తమ్ సాయి లక్ష్మన్ తదితరులు పాల్గొన్నారు.