బలగం టీవీ, వేములవాడ:
జిల్లాలో పర్మిషన్ లేని స్కూల్ లను వెంటనే సీజ్ చేయాలని కేవీపీస్ జిల్లా కార్యదర్శి ఎరవెల్లి నాగరాజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం పర్మిషన్ లేని స్కూల్స్ ను సిజ్ చేయాలని జిల్లాలో మరియు వేములవాడ టౌన్ పర్మిషన్ లేని స్కూల్స్ సిజ్ చేయాలి అని జిల్లా విద్యఅధికారిగారికి కుల వివక్ష వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో వినతిపత్రం సమర్పించారు.
ఈ సందర్బంగా కేవీపీస్ జిల్లా కార్యదర్శి ఎరవెల్లి నాగరాజు మాట్లాడుతూ జిల్లాలో ప్రవేట్ పాఠశాలలు ఎలాంటి అనుమతులు లేకుండా కొన్ని ఈ సంవత్సరం పుట్టుకొస్తున్నాయని, విద్యార్థులకు సదుపాయాలు లేకుండా ఉన్నా వాటిని వెంటనే వాటినీ సిజ్ చేయాలని డిమాండ్ చేశారు. ప్రవేట్ పాఠశాలల విద్య వ్యాపారాన్ని అరికట్టాలని పాఠశాలలో బుక్స్ మరియు పిల్లల స్కూల్ డ్రెస్ అనేక రకాల వస్తువులు అమ్ముతూ విద్యార్థుల తల్లిదండ్రులను నిలువు దోపిడీచేస్తున్నారని అన్నారు. విద్యను వ్యాపారం చేస్తున్న ప్రైవేట్ స్కూల్స్ పర్మిషన్ రద్దు చేయాలని, మండలాల విద్యాధికారుల పర్యవేక్షణ పూర్తి స్థాయిలో ఉండాలని అన్నారు.ఈ కార్యక్రమంలో నాయకులు మాసం సుమన్, ప్రసాద్, గిరిబాబు, తదితరులు పాల్గొన్నారు.
