పెద్దూరు పాఠశాలలో ఘనంగా సైన్స్ దినోత్సవ వేడుకలు..

0
80

బలగం టీవీ, రాజన్న సిరిసిల్ల:

ఎం పి హెచ్ ఎస్ పెద్దూరు పాఠశాలలో సైన్స్ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. భారతీయ విజ్ఞాన శాస్త్ర దిగ్గజం సర్ సివి రామన్ రామన్ ఎఫెక్ట్ కనుగొన్న సందర్భంగా జరుపుకునే జాతీయ సైన్సు దినోత్సవాన్ని పెద్దూరు పాఠశాలలో వివిధ రకాల కార్యక్రమాలతో అత్యంత కోలాహలంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా విద్యార్థులు వేసిన సైన్స్ ముగ్గులు అత్యంత ఆకట్టుకునేలా ఉన్నాయి. చిత్రలేఖన పోటీ మరియు ఎగ్జిబిట్ల ప్రదర్శన విద్యార్థులలో విజ్ఞాన శాస్త్ర జ్ఞానాన్ని పెంపొందించేలా, ఆలోచన రేకెత్తించేలా ఉన్నాయి. కాహూట్ ఆన్లైన్ క్విజ్ విద్యార్థులను బాగా అలరించింది. సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకొని పాఠశాలలో గణిత, సైన్స్ ఉపాధ్యాయులైన తోట శ్రీనివాస్, జనగాం రాజమల్లు, ఈరబోయిన రవికుమార్, బైరవాణి శ్రీ, నాగుల వీణ లను ప్రధానోపాధ్యాయులు ఇతర ఉపాధ్యాయ బృందం ఘనంగా సత్కరించారు. వివిధ పోటీలలో గెలుపొందిన విద్యార్థిని విద్యార్థులకు బహుమతులను పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు చక్రవర్తుల రమాదేవి, గుండెల్లి రవీందర్, భాగ్యనగర్ మాధవి, లకావత్ ఉమా, కడర్ల కల్పన, నందాల శంకర్, గడ్డి మహేష్ మరియు విద్యార్థి విద్యార్థులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here