బలగం టీవీ, ఇల్లంతకుంట:
ఇల్లంతకుంట మండల కేంద్రంలోని వాణినికేతన్ హై స్కూల్ లో సైన్స్ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా పాఠశాల ఆవరణలో విద్యార్థులు తయారుచేసి తీసుకుని వచ్చిన సైన్స్ ప్రాజెక్టులను ప్రదర్శించారు.
ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ తూముకుంట శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. సివి రామన్ కాంతి కిరణాలపై పరిశోధన చేసి భారతదేశానికి మొదటి నోబెల్ ప్రైజ్ సాధించిన రామన్ ఎఫెక్ట్ కనుగొన్న రోజు ఫిబ్రవరి 28 అని ఈరోజును జాతీయ సైన్స్ దినోత్సవముగా జరుపుకుంటున్నామని పేర్కొన్నారు. ప్రతి విద్యార్థి సైన్స్ పట్ల ఆసక్తిని పెంచుకోవాలని సూచించారు. సైన్స్ లేని ప్రపంచాన్ని మనం ఊహించలేమన్నారు. శాస్త్రీయ దృక్పథాన్ని అలవర్చుకోవడం వల్ల విద్యార్థుల భవిష్యత్తు బంగారుమయం అవుతుందన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన ఉత్తమ ప్రాజెక్టులకు బహుమతులను అందజేశారు.
ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ శ్రీనిధి. ఉపాధ్యాయులు శ్రీనివాస్. రాజు, రమేష్, సంతోష్, తిరుపతి, రాజు, సుమంగళి, శోభ, రేఖ, మహాలక్ష్మి, లావణ్య, సునంద, మౌనిక, కళ్యాణి, షమీమా, రేణుక, జలజ, శాంత, పద్మ, స్వాతి, రేణుక, సునీత లతోపాటు విద్యార్థులు పాల్గొన్నారు.
