బలగం టీవీ, రాజన్న సిరిసిల్ల :
సిరిసిల్ల రాజీవ్ నగర్ ఉన్నత పాఠశాలలో జాతీయ సైన్స్ దినోత్సవ సందర్భంగా పిల్లలు ఏర్పాటు చేసిన సైన్స్ మేళా అందరినీ అలరించింది. సైన్స్ టీచర్ భాగ్యలక్ష్మి ఆధ్వర్యంలో పిల్లలు తయారు చేసిన ఇన్నోవేషన్స్ సాంకేతిక పరికరాలు ఒక కొత్త పరిశోధనకు దారి తీస్తాయని ప్రధానోపాధ్యాయులు వెంకటేశ్వర్లు తెలిపారు. పిల్లలు తయారు చేసిన కరెంటుతో నడిచే యంత్రాలు లో కాస్ట్ నో కాస్ట్ తో తయారు చేసిన పరికరాలు ప్రదర్శనకు పెట్టారు. పాఠశాలలో జరిగిన ఈ కార్యక్రమంలో గ్రామస్తులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. పిల్లలు ఉత్సాహంగా తమ ప్రదర్శనలను వచ్చిన వాళ్లకి అర్థం చేయించారు.