బలగం టివి: తంగళ్లపల్లి:
మండలంలోని తెలంగాణ గిరిజన సంక్షేమ మహిళా డిగ్రీ కళాశాల మరియు ఫైన్ఆర్ట్స్ కళాశాల, తెలుగు విభాగం తరపున సెమినార్ నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ మట్ట సంపత్ కుమార్ రెడ్డి,అసోసియేట్ ప్రొఫెసర్, ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల కరీంనగర్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా భాషాత్మక సమాలోచన విద్య,ఉద్యోగ, ఉపాధి కల్పనలో తెలుగు భాషా పాత్ర అనే అంశం పై చర్చించారు. తదనంతరం కవితపోటిలలో,జానపద పాటల పోటీలో ప్రతిభ కనబరచిన విద్యార్థినిలకు బహుమతులు అందించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ కె రజిని,తెలుగు విభాగదిపతి సుధాసిందు, శ్రీమతి శాలిని,అధ్యాపక బృందం పాల్గొన్నారు.