సిరిసిల్ల, వేములవాడ పట్టణాలకు ప్రత్యేక ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయాలి..

0
44
  • జిల్లా ఎస్పీ కి వినతి పత్రం ఇచ్చిన జిల్లా అధ్యక్షులు జాతీయ బీసీ సంక్షేమ సంఘం మ్యాకల పర్శరాములు

బలగం టీవీ, రాజన్న సిరిసిల్ల:

రాజన్న సిరిసిల్లా జిల్లా కేంద్రం అయిన సిరిసిల్లా మరియు పుణ్యక్షేత్రం అయిన వేములవాడ పట్టణాలలో రోజురోజుకు వాహన రాకపోకలు పెరుగుతున్న నేపథ్యంలో, ప్రజల సురక్షిత ప్రయాణం కోసం ప్రత్యేక ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయాలని జిల్లా ఎస్పీ ని కోరుతూ వినతి పత్రం సమర్పించినట్లు జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు మ్యాకల పర్శరాములు తెలిపారు.

ప్రస్తుతం సిరిసిల్ల మరియు వేములవాడ పట్టణాల్లో ట్రాఫిక్ సమస్యలు తీవ్రంగా ఉన్నాయని, పాఠశాలలు, కళాశాలలు, మార్కెట్ ప్రాంతాలు, దేవాలయాల వద్ద వాహనాల రద్దీ అధికమవుతోందని ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా పుణ్యక్షేత్రం అయిన వేములవాడలో పండుగలు, ప్రత్యేక దినాల్లో భక్తుల రద్దీ ఎక్కువగా ఉండటంతో ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక విభాగం అవసరం ఉందని వివరించారు. అందువల్ల ప్రజల భద్రత, ప్రమాదాల నివారణ, ట్రాఫిక్ క్రమబద్ధీకరణ కోసం సిరిసిల్లా మరియు వేములవాడ పట్టణాలలో ప్రత్యేక ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేయాలని జిల్లా పోలీస్ శాఖను విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం మహిళా విభాగం జిల్లా అధ్యక్షులు నాగారం కొమురవ్వ పాల్గొని.. మహిళలు, విద్యార్థులు, వృద్ధులు రోడ్లపై సురక్షితంగా ప్రయాణించేందుకు ఈ నిర్ణయం ఎంతో అవసరమని తెలిపారు. ప్రజల ప్రయోజనార్థం వెంటనే చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా కోరారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here