బలగం టివి ,వేములవాడ
రెవెన్యూ డివిజనల్ అధికారి, వేములవాడ శ్రీ మధుసూదన్ వేములవాడ అసెంబ్లీ నియోజకవర్గం కి సంబంధించిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశమును నిర్వహించడం జరిగింది. ఇట్టి సమావేశంలో రెవెన్యూ డివిజనల్ అధికారి SSR-2024 లో బాగంగా 01.01.2024 నాటికి 18 సంవత్సరాలు నిండిన వారిని ఓటర్లు గా నమోదు చేయించటం జరుగుతుందని తెలిపారు. SSR-2024 తుది ఓటరు జాబితా ఫిబ్రవరి 8 వ తేదీన ప్రకటించ బడుతుందని తెలిపారు. 2024- ఎన్నికల సందర్భంగా EVM & VVPATs వినియోగంపై ప్రజలకు అవగాహన కల్పించటం కోసం RDO కార్యాలయంలో ఒక EVM & VVPAT అవగాహన ప్రదర్శన కేంద్రం ను ఏర్పాటు చేయటం జరిగిందని తెలిపారు. ఇట్టి సమావేశమునకు రాజకీయ పార్టీల ప్రతినిధులు పి. నరేందర్ (BRS), v. నిత్యానందరావు (Congress), M. రాము (BRS), జింక ఎల్లయ్య (వైఎస్సార్సీపీ), DAO సురేష్ మరియు ఎలక్షన్ నాయబ్ తహశీల్దార్ B. శ్రవణ్ కుమార్ లు పాల్గొన్నారు.