బలగం టివి, ఎల్లారెడ్డిపేట /వీర్నపల్లి
రాజన్న సిరిసిల్ల జిల్లా, వీర్నపల్లి మండలం, బావుసింగ్ నాయక్ తండా గ్రామంలో బంజారా ఆరాధ్య దైవం సేవాలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాలు.
బంజారాల ఆరాధ్య దైవ్యం సంత్ సేవాలాల్ మహరాజ్ అని గిరిజనులు పేర్కొన్నారు.
సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి సందర్భంగా వీర్నపల్లి మండలం బావుసింగ్ నాయక్ తండాలో గురువారం భోగ్ బండార్ కార్యక్రమం నిర్వహించగాప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత సేవాలాల్ మహారాజ్ జయంతిని కేసీఆర్ ప్రభుత్వం అధికారికంగా నిర్వహించిందని తెలిపారు. బంజారాల అభ్యున్నతికి పరితపించిన నాయకుడు సేవాలాల్ మహారాజ్ అని కొనియాడారు.
సంక్షేమ ఫలాలు ప్రతి గిరిజనుడికీ అందినపుడే సంత్‌సేవాలాల్ మహారాజ్ లక్ష్యం నెరవేరుతుందని తెలిపారు.తండాల ను పంచాయితీలుగా చేయఢం ద్వారా అబివృద్ధి జరుగుతుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ గుగులోత్ కళావతి, బీఆర్ఎస్ పార్టీ తోట ఆగయ్య, మండలాధ్యక్షుడు గుజ్జుల రాజిరెడ్డి, బంజార సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుగులోత్ సురేశ్ నాయక్, మాజీ సర్పంచ్ భూక్యా భారతీ, పాటి దినకర్, గిరిజన సంఘ నేతలు శ్రీరాంనాయక్, తులసీరాం, లింగంమూర్తి రాములు,దర్సింగ్, లింబ్యా హరిదాస్,మదన్, పాల్గొన్నారు.