పని ప్రదేశంలో లైంగిక వేధింపులు జరగకుండా చూడాలి..

0
71

బలగం టీవీ, రాజన్న సిరిసిల్ల:

సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం ప్రతి పని ప్రదేశంలో ఇంటర్నల్ కమిటీ అంతర్గత కమిటీ తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని జిల్లా సంక్షేమ అధికారి పీ.లక్ష్మీరాజ్యం సూచించారు. శుక్రవారం అపరెల్ పార్కులోని పంక్చుయేట్ వరల్డ్ ప్రయివేట్ లిమిటెడ్ ప్రతినిధులతో సమావేశం కావడం జరిగింది.ఈ సందర్భంగా కంపెనీ ఆవరణలో అంతర్గత కమిటీ పనితీరును పరిశీలించారు. కార్మికులతో మాట్లాడివారికి అందుతున్న ప్రయోజనాలు, పని ప్రదేశంలో స్థితిగతుల గురించి పరిశీలించారు. అలాగే మేనేజ్మెంట్ సభ్యులతో మాట్లాడి ప్రతి ఒక్కరి హక్కులను కాపాడాలని సూచించారు. అలాగే ప్రతి ఒక్కరికి ప్రోత్సాహక వాతావరణంలో పని ప్రదేశం ఉండాలని సూచించారు. పని ప్రదేశంలో సరైన భద్రతా చర్యలు చేపట్టడంతో పాటు మానసిక ఉల్లాసానికి చర్యలు చేపట్టాలని సూచించారు. అలాగే క్రచ్ పిల్లల డేకేర్ సెంటర్ లో పిల్లలకి అందుతున్న సేవలను పరిశీలించడం జరిగింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here