శివ భక్త మార్కండేయ స్వామి ఆలయ గడప ప్రతిష్ట మహోత్సవం ఘనంగా నిర్వహణ..

0
44

బలగం టీవీ, సిరిసిల్ల:

సిరిసిల్ల పట్టణంలో నూతనంగా నిర్మించే శ్రీ శివ భక్తి మార్కండేయ స్వామి దేవస్థానంలో గడప ప్రతిష్టాపన మహోత్సవం శుక్రవారం రోజున అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నట్లు పట్టణ పద్మశాలి సంఘం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు దూడo శంకర్, మండల సత్యం తెలిపారు.

సిరిసిల్ల పద్మశాలి సేవ భవనంలో పద్మశాలి సేవా భవనంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో సంఘం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు దూడo శంకర్ మండల సత్యం లు మాట్లాడుతూ… సిరిసిల్ల శివ భక్త మార్కండేయ స్వామి దేవాలయ పునర్నిర్మానంలో భాగంగా రేపు ఉదయం 10 గంటలకు గడప ప్రతిష్ట మహోత్సవం పద్మొత్తముల సమక్షంలో వైభవంగా నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. కావున ఇట్టి దైవ కార్యక్రమానికి పట్టణ పద్మశాలి కుల బాంధవులు, అన్ని వర్గాల ప్రజలు, నూతన కౌన్సిల్ సభ్యులు అధిక సంఖ్యలో హాజరై తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని వారి కోరారు.

ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘం కోశాధికారి ఎల్లే శ్రీనివాస్, సహాయ కార్యదర్శి కోడం శ్రీనివాస్, ఉపాధ్యక్షులు గాజుల బాలయ్య, మోర రవి మరియు వార్డు డైరెక్టర్లు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here