బలగం టీవి , బోయినిపల్లి;
రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం తడగొండ గ్రామంలో శ్రీ అలివేలి మంగ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఆదివారం రోజున శ్రీ గోదదేవి అమ్మవారి కళ్యాణ మహోత్సవం స్వామి వారి సన్నిధిలో అంగ రంగ వైభవంగా నిర్వహించినారు. ఈ కార్యక్రమానికి గ్రామంలోని ప్రముఖులు, గ్రామ పెద్దలు, ప్రజలు పాల్గొని స్వామి వారి తీర్ధ ప్రసాదాలు స్వీకరించి, అమ్మ వారి కళ్యాణాన్ని ఊరి ప్రజలందరూ కన్నుల పండుగగా జరుపుకున్నారు.
