బలగం టీవీ, రాజన్న సిరిసిల్ల :
- కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ దుద్దిళ్ల శ్రీపాదరావు సేవలు మరువలేనివని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా కొనియాడారు. ఆదివారం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ దుద్దిళ్ల శ్రీపాదరావు జయంతి వేడుకలను జిల్లా యూత్ అండ్ స్పోర్ట్స్ ఆఫీస్ ఆద్వర్యంలో జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ స్పీకర్ దుద్దిళ్ల శ్రీపాదరావు చిత్రపటానికి కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, వివిధ శాఖల జిల్లా అధికారులు పూల మాలలు వేసి, నివాళులు అర్పించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా యూత్ అండ్ స్పోర్ట్స్ అధికారి రాందాస్ తదితరులు పాల్గొన్నారు.