బలగం టీవి ,,తంగళ్లపల్లి
రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండల పోలీస్ స్టేషన్ లో నూతన ఎస్సైగా ప్రశాంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టారు.ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ మండలంలోని శాంతిభద్రతలు పరిరక్షణకు ప్రజలందరూ సహకరించాలని, ఏమైనా సమస్యలు ఉంటే నేరుగా వచ్చి కలవవచ్చునని అన్నారు. అసాంఘిక కార్యక్రమాలు,జూదం,అక్రమ మాధ్యం తదితరవాటిపై ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు.పోలీసు సిబ్బంది నూతన ఎస్ఐకి శుభాకాంక్షలు తెలిపారు.