సిరిసిల్ల న్యూస్:
ముస్లిం మైనారిటీల అభివృధి కర పత్రాల ఆవిష్కరణ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక రాష్ట్రంలోని ముస్లింలకు దశాబ్దాల నుండి ఏ ప్రభుత్వం చేయలేని అభివృద్ధిని ముఖ్యమంత్రి కేసిఆర్ అన్ని వర్గాలతో పాటు ముస్లింలకు తగిన ప్రాధాన్యత ఇస్తూ ముస్లింల జీవితాల్లో వెలుగులు నింపిన ప్రభుత్వం తెరాస ప్రభుత్వమేనని బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో గురువారం సీనియర్ రాష్ట్ర నాయకులు ముజీబ్ ఆధ్వర్యంలో ప్రచురించిన ముస్లింల అభివృధి కర పత్రాలను బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు తొట ఆగయ్య, రాష్ట్ర నాయకులు చీటీ నర్సింగరావు, టెక్స్టైల్ చైర్మన్ గూడూరి ప్రవీణ్, పట్టణ అధ్యక్షులు జిందం చక్రపాణి, ఉపా అధ్యక్షులు సత్తార్, మైనారిటీ పట్టణ అధ్యక్షులు చాంద్ పాషా, మహమూద్, అంజద్ మైనారిటీ జనరల్ సెక్రట్రీ రఫీద్దీన్ లు పార్టీ కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మైనారిటీ నాయకులు మాట్లాడుతూ.. ముస్లిం మైనార్టీలకు టీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని విధాల ఆదుకుంటుందని అన్నారు. ముఖ్యంగా మైనారిటీ విద్యార్థుల చదువుల కోసం గురుకుల పాఠశాలలు, కళాశాలలు ఉన్నత విద్య చదివే విద్యార్థులకు స్కాలర్షిప్ లు అందించడం జరిగింది అన్నారు. షాది ముబారక్ ద్వారా ఆడ కుతూర్ల వివాహాలకు సాయం చేయడం జరిగింది.. మస్జిద్ ల నిర్మానాలకు, షాది ఖానలు, మైనారిటీ బంధువు, కుట్టు మిషన్లు పంపిణీ, రంజాన్ పండుగకు బట్టలు ఇవ్వడం జరుగుతుంది అన్నారు. మస్జిద్ లోని గురువులైన ఇమామ్, మౌజన్ లకు ప్రతి నెల గౌరవ వేతనం ఇవ్వడం జరుగుతుంది అన్నారు. దేశంలో ఎక్కడ లేని పథకాలను మైనారిటీల కోసం తెలంగాణ ప్రభుత్వం అందిస్తుంది అన్నారు. మైనారిటీ రాష్ట్ర నాయకులు ముజీబ్ కర పత్రాల ద్వారా ఉర్దూలో, తెలుగు లో కృప్తంగ ప్రచురించి మైనారిటీ లకు బి ఆర్ఎస్ ప్రభుత్వం అందించిన ముస్లిం జీవితాలు వెలుగులను వివరించడం జరిగింది అన్నారు. రాష్ట్రంలోని ప్రతి ఒక్క ముస్లిం బిఆర్ఎస్ ప్రభుత్వం చేసిన సహాయాన్ని మర్వకుండ ప్రతి ఒక్క ఓటు కారు గుర్తుకు వేసి మంత్రి కేటీఆర్ ను గెలిపించుకునే రాష్ట్రంలో బిఆర్ఎస్ ప్రభుత్వాన్ని మళ్ళీ అధికారంలో తిస్కొచే బాధ్యతను స్వీకరిస్తూ విశ్వాసంతో ఓట్లు వేసి గెలిపించుకోవాలని పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ కార్యకర్తలు యూనుస్, మోహ్సీన్, సాజిద్, రఫియొద్దిన్