విలాసవంతమైన జీవితాలు గడపడానికి బ్యాంక్ రుణాలు,ఆన్లైన్ ఉద్యోగల పేరుతో సైబర్ మోసాలు

సిరిసిల్ల న్యూస్​:

Just dial App ద్వారా రుణాలు అవసరం ఉన్న వారి ఫోన్ నంబర్స్ తీసుకొని సైబర్ మోసాలకు పాల్పడుతున్న ఇద్దరు అంతర్ జిల్లా సైబర్ నిందుతుల అరెస్ట్.

1,50,000-/ నగదు,బెలోనా కార్,నాలుగు మొబైల్ ఫోన్స్,05 మొబైల్ సిమ్ కార్డ్స్, ఒక చెక్ బుక్,3 ఏటీఎం కార్డ్స్ స్వాధీనం.

జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ గారు.

నిందుతుల వివరాలు.
1.ధనవాత్ రమేష్,S/O రావుజ, 29సం ,నల్గొండ జిల్లా, దామాడిచెర్ల మండలం ,KJR(కొండూరు జానా రరెడ్డి) కాలాని.
2.ధనవాత్ రాజు,S/O కురువ,age 24 సం,నల్గొండ జిల్లా, దామాడిచెర్ల మండలం ,KJR(కొండూరు జానా రరెడ్డి) కాలాని.

ఈ సందర్భంగా ఎస్పీ గారు మాట్లాడుతూ…

నల్గొండ జిల్లా, దామాడిచెర్ల మండలం ,KJR(కొండూరు జానా రరెడ్డి) కాలానికి చెందిన ధనవాత్ రమేష్, S/O రావుజ, 29సం అనే వ్యక్తి వ్యవసాయం చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు, వ్యవసాయం వలన వచ్చే డబ్బులు సరిపడక హైద్రాబాద్ లోని హయత్ నగర్ లోని లెక్చరర్ కాలనిలో అద్దెకు ఉంటూ డ్రైవర్ గా పని చేస్తూ వచ్చే డబ్బులు నాకు నా జల్సాలకు సరిపడక సులువుగా డబ్బులు సంపాదించి విలాసవంతమైన జీవితం గడపాలనే ఉద్దేశ్యంతో గతంలో రమేష్ Just dial App లో లోన్ ఏజెంటుగా పని చేసిన అనుభవం ఉన్నందున, just dial app లో రిజిస్టర్ చేసుకొని రుణాలు అవసరం ఉన్నవారు just dail app లో తనిఖీ చేయగా వారి ఫోన్ నెంబర్ లు తీసుకొని లోన్ అవసరం ఉన్నవారికి , లోన్ రిజెక్ట్ అయిన వారికి సివిల్ స్కోర్ తక్కువ ఉన్నవారి డీటెయిల్స్ జస్ట్ డయల్ ఆప్ ద్వారా తీసుకొని హైదరాబాదులోని SBI మాదాపూర్ బ్రాంచ్ నందు రుణాలు పిస్తానని చెపుతూ, తన గ్రామస్థుడైన ధనవాత్ రాజు s/o కురుము పాలిటెక్నిక్ చేసి ఏమి పని లేనందున హైదరాబాద్ లోని ఎల్ బి నగర్ లో ఉంటూ డ్రైవర్ పని చేస్తూ ఉంటున్నాడు.రాజు తో కలసి ర్రమేష్ యొక్క ఫోన్ నెంబర్ 886575351, 900371431, 9640251437 లతో మరియు ధనవత్ రాజు యొక్క ఫోన్ నెంబర్లు 9121914378, 9553522969 గల నెంబర్లతో లోన్ డబ్బులు అవసరం ఉన్నవారికి ఫోన్ చేసి మోసం చేస్తూ వచ్చిన డబ్బులతో మరియు అదేవిధంగా ఉద్యోగాలు ఇప్పిస్తాం అని,బ్యాంక్ ద్వారా రుణాలు ఇప్పిస్తాం అని మాయమాటలు చెప్పి అమాయక ప్రజలను మోసం చేస్తూ వచ్చిన డబ్బులతో గోవా ఇతర రాష్ట్రాలకు వెళుతూ విలాసవంతమైన జీవితం గడుపుతున్నారు.

ఈ విధంగా ధనవాత్ రమేష్,రాజు వారి యెక్క నంబర్స్ ద్వారా రుణాలు అవసరం ఉన్నవాళ్లకు ఫోన్ కాల్ చేయగా గంభిరావుపేటకు చెందిన ముక్తవరం పద్మావతికి వెళ్ళగా, పద్మావతిని రమేష్ SBI మాదాపూర్ బ్రాంచ్ బ్యాంకు మేనేజర్ సుధీర్ రెడ్డి అని,రాజు ఎస్బిఐ ఫీల్డ్ ఆఫీసర్ రామ్ రెడ్డి అని పరిచయం చేసుకొని బ్యాంక్ నుండి
26,00,000/-రూపాయలు రుణం ఇప్పిస్తాం అని మాయమాటలు చెప్పి పద్మావతిని నమ్మించి మొదట ప్రాసెసింగ్ ఫీజు,లోన్ లాగిన్ పేమెంట్ కొరకు ,ఇన్సూరెన్స్ ఫీ అని అడుగగా ఇలా వివిధ దఫాలుగా పద్మావతి రమేష్ రాజ్ కురుము లను నమ్మి మొత్తం రూపాయలు 3,58,795/- రూపాయలు రమేష్ యొక్క బ్యాంకు బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ,మిర్యాలగూడ బ్రాంచ్ అకౌంట్ నెంబర్ 52 2 0 1 3 4 8 3 9 0 లింక్ అయి ఉన్న ఫోన్ నెంబర్ కి upi ద్వారా పంపించడం జరిగింది.రమేష్, రాజు లు పలు కేసులలో జైలు జీవితం గడిపి బయటకు వచ్చిన తరువాత డబ్బులు అవసరం పడగ 01-11-2023 రోజున పద్మావతికి కాల్ చేసి 22,000/- రూపాయలు పంపించమని అడుగగా పద్మావతికి రమేష్ ,రాజ్ ల మీద అనుమానం వచ్చి గంభీరావుపెట్ పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేయగా సి.ఐ శశిధర్ రెడ్డి, సైబర్ క్రైమ్ ఆర్.ఎస్.ఐ జూనైద్ ,ఎస్.ఐ మహేష్ ఆధ్వర్యంలో స్పెషల్ టీమ్ ఏర్పాటు చేసి దర్యాప్తు చేయగా పద్మావతిని నమ్మించడానికి ఒక కార్ లో చెక్ బుక్ , 3 atm కార్డ్స్,మూడు మొబైల్ తీసుకొని వచ్చే దారిలో లినగన్నపేట్ క్రాస్ రోడ్ వద్ద శనివారం సాయంత్రం అందజ 06 గంటల సమయంలో అరెస్ట్ చేసి 1.రెడ్ కలర్ బెలూన్ కార్ ts07jr2909,2.లెదర్ బ్యాగ్,3.icici బ్యాంక్ చెక్ బుక్,4. మూడు ATM కార్డ్స్, 4..నాలుగు మొబైల్స్,5.సిమ్ కార్డ్స్,6..లక్ష ఐబై వేళా రూపాయల నగదు స్వాధీనం చేసుకోని విరని ఈ రోజు రిమాండ్ కి తరలించడం జరుగుతుంది.

ధనవాత్ రమేష్, రాజు ల మీద సైబరాబాద్, అల్వాల్, బేగంపేట గోపాలపురం పిఎస్, మహంకాళి పిఎస్, రాజేంద్రనగర్ పిఎస్, కామారెడ్డి, ఖమ్మం పోలీస్ స్టేషన్ లలో 15 కేసులు నమోదు కగా పలు కేసుల్లో జైలు జీవితం గడిపారు, అంతే కాక ధనవాత్ రమేష్ ఫోన్ నెంబర్ మీద NCRP ప్రోట్రల్ లో దర్యాప్తు చేయగా 19 మాయక ప్రజల దగ్గర రుణాలు,ఉద్యోగాల పేరిట సుమారు 20 లక్షల వరకు మోసం చేసినట్లు ఫిర్యాదులు రావడం జరిగింది.

మీడియా సమావేశంలో డిఎస్పీ ఉదయ్ రెడ్డి, సి.ఐ శశిధర్ రెడ్డి, ఎస్.ఐ మహేష్, ఆర్.ఎస్.ఐ జునైద్ సిబ్బంది ఉన్నారు.

Recent Articles

spot_img

Related Stories

Leave A Reply

Please enter your comment!
Please enter your name here

Stay on op - Ge the daily news in your inbox

Jeetwin

Jeetbuzz

Baji999

sekabet girişSekabetSekabetSekabet GirişSekabet Güncel GirişSekabetSekabetSekabet GirişSekabet Güncel Giriş sekabet giriş Sekabet Sekabet Sekabet Giriş Sekabet Güncel Giriş Sekabet Sekabet Sekabet Giriş Sekabet Güncel Giriş