అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, ఉమెన్ సేఫ్టీ వింగ్, (షీ టీమ్స్ మరియు భరోసా ), తెలంగాణ, హైదరాబాద్ వారి ఆదేశాల మేరకు రాజన్న సిరిసిల్ల జిల్లా లో కొత్తగా ఏర్పాటు కాబోతున్న భరోసా సెంటర్ యందు తాత్కాలిక ప్రాతిపాధికన ఎంపికకోసం ఆసక్తి గల వారు ధరఖాస్తులు చేసుకోవాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ గారు కోరారు.
కాంట్రాక్ట్ ప్రాతిపదికన నియామకం కొరకు భరోసా సెంటర్ రాజన్న సిరిసిల్ల లో కౌన్సిలర్ కం సెంటర్ కోఆర్డినేటర్ (01 పోస్ట్), లీగల్ సపోర్టింగ్ పర్సన్ (01 పోస్ట్), సపోర్టు పర్సన్ (02పోస్ట్) , రిసెప్షనిస్ట్ (01) ANM (01)గా పని చేయుటకు సర్వీస్ రెగ్యులరైజేషన్ హక్కులు లేకుండా కాంట్రాక్ట్ ప్రాతిపదికన తగిన మహిళా అభ్యర్ధుల నుండి ధరఖాస్తులు కోరడమైనది. ఈ ఉద్యోగ నియామకాలు ఒక సంవత్సరం కాల వ్యవది కొరకు మాత్రమే. అదే కాల వ్యవది ఆవశ్యకత మరియు బడ్జెట్ ప్రకారం ప్రతి సంవత్సరం పొడగించబడుతుంది. బయోడేటా, ఎడ్యుకేషన్ సర్టిఫికెట్స్, ఎక్స్పీరియెన్స్ సర్టిఫికేట్ అడిగిన పత్రాలు అన్నీ
https://womensafetywing.telangana.gov.in
ఈ వెబ్ సైటులో దరఖాస్తు చేసుకోగలరు.
1) కౌన్సిలర్ కం సెంటర్ కోఆర్డినేటర్
మహిళా అభ్యర్థులు మాత్రమే వయస్సు 25 సం॥ నుండి 40సం|| లోపు ఉండాలి. నెలసరి జీతం : రూ॥ 25,000/-+5000, విధ్యార్హ త:Msc in psychology or MA in psychology or Master of social work
Experience
- మహిళలకు /పిల్లలకు మానసిక సామాజిక కౌన్సెలింగ్ అందించడంలో సంబంధిత అనుభవం 24 నెలల కంటే తక్కువ ఉండకూడదు.
- కనీసం 50 మంది సంబంధిత క్లయింట్లుకు 100 కౌన్సెలింగ్ సెషన్‌లకు తక్కువ కాకుండా నిర్వహించి ఉండాలి.
- బాధితులకు కౌన్సెలింగ్ చేసిన గత అనుభవం ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది
- మహిళ మరియు పిల్లల రంగంలో, సామాజిక రంగం, స్వచ్ఛంద సంస్థలో పని చేస్తున్న అభ్యర్థులకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది.
- దరఖాస్తుదారులు మా ఇటీవలి లేదా గత ఉద్యోగములో భాగంగా పైన పేర్కొన్న అనుభవాన్ని కలిగి ఉండాలి.
2 ) లీగల్ సపోర్టింగ్ పర్సన్ :
మహిళా అభ్యర్థులు మాత్రమే వయస్సు 25 సం॥ నుండి 40సం|| లోపు ఉండాలి. నెలసరి జీతం : రూ॥ 22,000/- విధ్యార్హ త : ఎల్.ఎల్.బి, ఎల్.ఎల్.ఎమ్
Experience
1) 24 నెలల కంటే తక్కువ అనుభవం ఉండకూడదు, స్వతంత్రంగా లేదా సీనియర్ న్యాయవాదితో కలిసి మహిళలు మరియు పిల్లలకు సంబంధించిన 10 కేసులకు తగ్గకుండా పరిష్కరించగలిగి ఉండాలి.
2) డి.వి / రేప్ / ఇతర ఫ్యామిలీ కోర్టు కేసులు / పోక్సో అనుభవం కలిగి ఉండాలి. పి.పి / డి.ఎల్.ఎస్.ఎ కి మద్దతు ఇచ్చిన అనుభవం ఉండాలి. క్లయింట్లు మరియు సాక్షులను బ్రీఫింగ్ చేసిన అనుభవం ( కనీసం 10 కేసుల్లో ) మాక్ ట్రాయల్స్ నిర్వహించడంలో అనుభవం కలిగి ఉండాలి.
3) సపోర్టు పర్సన్:
మహిళా అభ్యర్థులు మాత్రమే, వయస్సు 25 సం॥ నుండి 35సం||లోపు ఉండాలి నెలసరి జీతం: రూ. 20,000/-
విధ్యార్హత: సోషల్ వర్క్, చైల్డ్ డెవలప్మెంటు / సైకాలజిస్ట్ పోస్టు గ్రాడ్యూయేట్ డిగ్రీ ఉండాలి.
Experience:
ధరఖాస్తు దారులు 12 నెలల కంటే తక్కువ అనుభవం ఉండకూడదు బాలల హక్కులు లేదా పిల్లల రక్షణ రంగంలో పనిచేసిన అనుభవం ఉండాలి లేదా స్టేట్ చైల్డ్ ప్రొటెక్షన్ సొసైటీ లేదా అలాంటి సంస్థతో కలిసి పనిచేసి ఉండాలి లేదా పిల్లల సంరక్షణలో ఉన్న చిల్డ్రన్స్ హోమ్ లేదా షెల్టర్ హోమ్ అధికారి అయి ఉండాలి లేదా జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్లో ఉద్యోగంలో అయినా ఉండాలి.
రిసెప్షనిస్ట్.
మహిళా అభ్యర్థులు మాత్రమే, వయస్సు 25 సం॥ నుండి 35సం||లోపు ఉండాలి నెలసరి జీతం: రూ. 15,000/-
విధ్యార్హత: కంప్యూటర్ పరిజ్ఞానం ఉన్న ఏదైనా డిగ్రీ,
Experience = రిసెప్షనిస్ట్ గా 24 నెలల కంటే తక్కువ అనుభవం ఉండకుదదు.
మల్టీ పర్పస్ హెల్త్ వర్కర్ (ANM).
మహిళా అభ్యర్థులు మాత్రమే,వయస్సు 25 సం॥ నుండి 35సం||లోపు ఉండాలి నెలసరి జీతం: రూ. 16,000/-
విద్యార్హత: Bsc నర్సింగ్/GNM/ANM 2 సంవత్సరాల అనుభవం, జీతం 16,000 కలదు.
Experience = గైనకలజిస్ట్,పిల్లల వైద్యుడు,సర్జన్ దగ్గర 24 నెలల కంటే తక్కువ కాకుండా పని చేసి ఉండాలి.