సిరిసిల్ల న్యూస్:
ద్విచక్ర వాహనం దొంగతనం, దొంగతనం చేయుటకు ప్రయతించిన కేసులో 2 నెలల 15 రోజుల సాధారణ జైలు శిక్ష.
ద్విచక్ర వాహనం దొంగతనం, దొంగతనం చేయుటకు ప్రయతించిన కేసులో 2 నెలల 15 రోజుల సాధారణ జైలు శిక్ష విధిస్తూ సిరిసిల్ల ప్రథమశ్రేణి న్యాయమూర్తి ప్రవీన్ బుధవారం తీర్పు చెప్పారు.
ప్రాసిక్యూషన్ కథనం మేరకు.. 13 సెప్టెంబర్ 2023 న అంబిక నగర్ సిరిసిల్లకు చెందిన చిలుక రమేశ్ తన ఇంటి ముంగిట పార్క్ చేసిన మరియు 13 సెప్టెంబర్ 2023. భూర్ల ప్రతాప్ వెంకంపేట అను అతను తన ఇంటి ముంగిట పార్క్ చేసిన మరియు 13 సెప్టెంబర్ 2023రోజున కోడం చందర్ గాంధీ నగర్ శ్రీలక్ష్మి డిజిటల్ కలర్ లాబ్ ముందు పార్క్ చేసిన ద్విచక్ర వాహనoలను దొంగతనం చేసిన మరియు దొంగతనం చేయుటకై ప్రయత్నం చేసిన వ్యక్తిపై వారు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేసాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి ద్విచక్ర వాహనంలను దొంగతనం చేసిన మరియు దొంగతనం చేయుటకు ప్రయత్నం చేసిన మిస విష్ణు తండ్రి నాంపల్లి వయసు 26 yrs, ముస్తబాద్ చెందిన వ్యక్తిని అరెస్టు చేసి రిమాండ్ కి తరలించారు.విచారణ అనంతరం విచారణ అధికారి P. శ్రీనివాస్ రావు SI కోర్టులో చార్జిషీట్ దాఖలు చేసారు.CMS SI లావుడ్య శ్రీకాంత్ గారి ఆధ్వర్యంలో కోర్టు కానిస్టేబుల్ వేముల నరేష్ సాక్షులను ప్రవేశ పెట్టడం జరిగింది.
కేసు పూర్వపరాలు పరిశీలించిన మేజిస్ట్రేట్ నిందితుడికి 2 నెలల 15 రోజుల జైలు శిక్ష విధించారని టౌన్ ఇన్స్పెక్టర్ ఉపేందర్ ఒక ప్రకటనలో తెలిపారు.