రాష్ట్రస్థాయి సీఎం కప్ జూడో పోటీలకు సిరిసిల్ల విద్యార్థి పెద్ది రిష్విక్ ఎంపిక…

0
126

బలగం టీవీ, రాజన్న సిరిసిల్ల:

రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన పెద్ది రిష్విక్ రాష్ట్రస్థాయి సీఎం కప్ జూడో ఛాంపియన్‌షిప్‌కు ఎంపికయ్యారు. గంభీరావుపేట మండలం మల్లారెడ్డిపేటకు చెందిన రిష్విక్, ప్రస్తుతం కరీంనగర్‌లోని మానేరు హైస్కూల్‌లో పదవ తరగతి చదువుతున్నారు.

రిష్విక్ ఇటీవల జరిగిన జిల్లా స్థాయి పోటీల్లో అద్భుతమైన ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయికి అర్హత సాధించారు. గ్రామీణ ప్రాంత క్రీడాకారులను ప్రోత్సహించేందుకు తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న సీఎం కప్ పోటీల్లో, రాష్ట్రస్థాయిలో కూడా మెడల్ సాధించి జిల్లా పేరు ప్రఖ్యాతులు పెంచడమే లక్ష్యంగా రిష్విక్ కఠోర సాధన చేస్తున్నారు.

కోచ్‌ల మార్గదర్శకత్వంలో రిష్విక్ చూపిస్తున్న క్రమశిక్షణ, నైపుణ్యంపై కుటుంబ సభ్యులు, ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రస్థాయిలో రిష్విక్ విజయం సాధించాలని గ్రామస్తులు ఆకాంక్షిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here