- సిరిసిల్ల పట్టణ విశ్వకర్మ కార్పెంటర్స్ వెల్ఫేర్ సొసైటి
- ఎన్నికల కార్యనిర్వహణాదికారి శ్రీరాముల వేణుగోపాలాచారి
బలగం టీవీ, రాజన్న సిరిసిల్ల:
సిరిసిల్ల పట్టణ విశ్వకర్మ కార్పెంటర్స్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో రానున్న ఎన్నికల ప్రకటన విడుదలైంది. తేది 26-01-2026 సోమవారం స్థానిక బి.వై. నగర్‌లో గల సొసైటీ భవనంలో నిర్వహించిన సాధారణ సమావేశంలో తీసుకున్న తీర్మాణం మేరకు, సొసైటీ ఎన్నికలను తేది 07-03-2026 శనివారం నిర్వహించాలని నిర్ణయించారు.
సొసైటీ నియమావళి ప్రకారం అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి, కోశాధికారి పదవులకు ఎన్నికలు జరగనున్నాయి. ఇట్టి పదవులకు పోటీ చేయు అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేస్తూ నామినేషన్ రుసుము అధ్యక్షులు రూ॥ 3000/-, ప్రధానకార్యదర్శి రూ॥ 2500/-, కోశాధికారి రూ॥ 2000/- లు చెల్లించి పోటీలో పాల్గొనవలయును, నామినేషన్ రుసుము వాపసు ఇవ్వబడదు.
సిరిసిల్ల మున్సిపల్ పరిధిలో గల వడ్రంగి (విశ్వకర్మ) కులస్తులకు మాత్రమే ఓటు హక్కు కలదు. సభ్యులందరూ సభ్యత్వ రుసుములు చెల్లించి ఉండవలెను. ఎన్నికలలో ఓటు వేయదలచిన వారు ప్రత్యేక ఎన్నికల రుసుము రూ. 200/- (అక్షరాల రెండు వందల రూపాయలు) చెల్లించి రశీదు పొందిన వారికి మాత్రమే ఓటు హక్కు ఉంటుంది.
తేది 19-2-2026 నుండి 23-2-2026 రోజున సాయంత్రం 4 గంటల వరకు సభ్యత్వము స్వీకరించబడును. తేది 28-2-2026 శనివారం రోజున ఉ॥ 10 గంటల నుండి మ॥ 12 గంటల వరకు విశ్వకర్మ కార్పెంటర్స్ వెల్ఫేర్ సొసైటి భవనములో నామేనేషన్లు స్వీకరించబడును. తేది 1-3-2026 ఆదివారం రోజున ఉ॥ 10 గంటల నుండి మ॥ 12 గంటల వరకు నామేనేషన్లు ఉపసంహరణ. తేది 7-3-2026 శనివారం రోజున ఉ॥ 9 గంటల నుండి మ॥ 1 గంటల వరకు ఎన్నికలు నిర్వహించబడును. సాయంత్రం 5 గంటలకు ఎన్నికల ఫలితాలు తెలుపబడును.
పోలింగ్ స్థలం: విశ్వకర్మ కార్పెంటర్స్ వెల్ఫేర్ సొసైటీ భవనం, బి.వై.నగర్, సిరిసిల్ల.
ఎన్నికల ప్రత్యేక రుసుము ఎన్నికల అధికారి గారికి లేదా సహాయ అధికారి చెలిమెల రామస్వామి, విశ్వనాధుల చంద్రమౌళి గార్లకు చెల్లించవచ్చని తెలిపారు. సభ్యత్వ నమోదు కోసం రశీదు పుస్తకాలు జారీ చేయబడతాయి. రశీదు పుస్తకాలు తీసుకున్న వారు 23-02-2026 సాయంత్రం 4 గంటలలోగా ఎన్నికల అధికారికి తిరిగి అందజేయాలి. సభ్యులందరూ ఈ ఎన్నికల ప్రక్రియలో చురుకుగా పాల్గొని సంఘ బలోపేతానికి సహకరించాలని నిర్వాహకులు విజ్ఞప్తి చేశారు.
