బలగం టివి, రాజన్న సిరిసిల్ల
ఈనెల తొమ్మిదవ తేదీన సిరిసిల్ల పట్టణంలో నాయిని బ్రాహ్మణ సంఘం వారి ఆధ్వర్యంలో నిర్వహించనున్న శ్రీ రామప్ప రామలింగేశ్వర జాతర మరియు రజక సంఘం వారి ఆధ్వర్యంలో నిర్వహించనున్న శ్రీ మడేలేశ్వర స్వామి వారి జాతర గంగపుత్ర సంఘం వారి ఆధ్వర్యంలో నిర్వహించనున్న గంగమ్మ జాతరలకు ప్రత్యేక ఆహ్వానితులుగా రావలసిందిగా ఆయా కుల సంఘాల నాయకులు బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శాసనసభ్యులు కల్వకుంట్ల తారక రామారావు ని కలిసి ప్రత్యేక ఆహ్వాన పత్రికను అందించగా..
అదేవిధంగా ఈనెల 12వ తేదీన సిరిసిల్ల పట్టణంలో నిర్వహించనున్న శ్రీ శివ భక్త మార్కండేయ స్వామి శోభాయాత్ర మరియు శ్రీ శివ భక్త మార్కండేయ స్వామి జయంతి ఉత్సవాలలో ముఖ్య అతిథులుగా పాల్గొనాల్సిందిగా బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శాసనసభ్యులు కల్వకుంట్ల తారక రామారావు సిరిసిల్ల పద్మశాలి సంఘం నాయకులు కుల బాంధవులు ప్రత్యేక ఆహ్వానం పత్రికను అందించారు..
ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘం నాయకులు రజక సంఘం నాయకులు గంగపుత్ర సంఘం నాయకులు నాయిని బ్రాహ్మణ సంఘం నాయకులు ఆయా కులాల పెద్దలు పుర ప్రముఖులు బిఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు..
