రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల నియోజకవర్గ పెద్దూర్ బాబాజీ కాలనీ లో గడప గడపకు సిరిసిల్ల బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు జిందం చక్రపాణి , బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు బొల్లి రామ్మోహన్, ఉద్యమ నాయకుడు, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు వోజ్జల అగ్గి రాములు జిల్లా ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తల తో కలిసి మంత్రివర్యులు కల్వకుంట్ల తారక రామారావు గారిని భారీ మెజారిటీతో గెలిపించాలని గడపగడపకు బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను వివరిస్తూ సిరిసిల్ల నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలను తెలియజేస్తూ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న బీఆర్ఎస్ పార్టీ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య కాలనీవాసులతో మాట్లాడారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో సిరిసిల్ల బీఆర్ఎస్ పట్టణధ్యక్షులు జింద చక్రపాణి, కౌన్సిలర్ లింగంపల్లి సత్యనారయణ తదితరులు పాల్గొన్నారు.
