బలగం టీవి …ముంబాయి
ఈ రోజు ముంబాయి లోని వర్లీ లో మార్కండేశ్వర స్వామి దేవస్థానం వద్ద అయ్యప్పస్వామి భక్త మండలి వారి ఆధ్వర్యంలో నిర్వహించిన మహా పడి పూజా కార్యక్రమంలో స్థానిక MLC సునీల్ షిండే గారితో పాటు సిరిసిల్ల మునిసిపల్ కౌన్సిలర్ గెంట్యాల శ్రీనివాస్ గారు, మాజీ కౌన్సిలర్ గుండ్లపెల్లి పూర్ణచందర్ గారు పాల్గొన్నారు. వీరికి అయ్యప్ప స్వామి భక్త మండలి వారు సన్మానం చేశారు. ఇట్టి కార్యక్రమంలో ముంబాయి వర్లి పద్మశాలి సమాజ సుదారక మండలి అధ్యక్షులు వాసాల శ్రీహరి (వంశీ) గారు, ఆంధ్రమహా సభ కార్యవర్గ సభ్యులు సిరిమల్లె శ్రీనివాస్ గారు, గుడ్ల నరేష్ గారు వేముల మనోహర్ గారు పాల్గొన్నారు