బలగం టివి:
ర్యాలీలో డా. అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన అనంతరం కృష్ణ దొనికెని మాట్లాడుతూ కేసీఆర్ పాలనలో గల్ఫ్ కార్మికులకు కన్నీళ్ళే మిగిలాయని.. గల్ఫ్ దేశాల నుండి తమ సంస్థ ద్వార 500 డెడ్ బాడీలను పంపించి వారి కుటుంబాలకు 1 లక్ష రూపాయల నుండి 3 లక్షల 20వేల రూపాయాల ఆర్థికసాయం అందించిన కుటుంబాలు వందలాది మంది ఉన్నారని, ఇప్పటి వరకు బాధిత కుటుంబాలకు 50లక్షల పైగా ఆర్థిక సహాయం అందించి, కరోనా వేలాది మందిని గల్ఫ్ దేశాల నుండి స్వగ్రామాలకు చేర్చమని, గల్ఫ్ దేశాల్లో లక్ష సంతకాలు సేకరించి కేటీఆర్ కు అందజేసమని, అన్ని గల్ఫ్ ప్రభావిత జిల్లాల గుండా నిర్మల్ నుండి హైదరబాద్ వరకు పాదయాత్ర చేసి గల్ఫ్ బాధితుల కన్నీటిని ప్రభుత్వాలకు తెలిసేలా చేసినా కేసీఆర్ కు గల్ఫ్ కార్మికుల బాధలు తెలియలేదని చిన్నచూపు చూస్తూ తిడుతుంటే గల్ఫ్ కార్మికుడు ఎదురుతిరగక తప్పలేదని తెలిపారు.

గల్ఫ్ కార్మికుల సమస్యలను పాలకులకు పార్టీలకు మరియు ప్రపంచానికి తెలిసేలా కేటీఆర్ మీద టీవి రిమోట్ గుర్తు తో స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచామని, ఇప్పటికీ నాలుగు మండలాలు, 50 గ్రామాలు తిరిగి గల్ఫ్ కార్మికుల కుటుంబాలను కలసి ఐక్యత చూపించాలని కోరామని, టీవి రిమోట్ గుర్తుకు ఓటువేసెల కేసీఆర్ మరియు కేటీఆర్ గల్ఫ్ కార్మికులపై చిన్నచూపు నిర్లక్ష్యాన్ని అర్థమయ్యేలా వివరించి చెప్పడంలో విజయం సాధిస్తామని నమ్మకం ఉన్నామని తెలిపారు.
సిరిసిల్ల టౌన్ లో తప్ప వీర్ణపల్లి మండలంతో సహా అన్నీ మండలాలలో రోడ్లు బాగలేవని, యువత ఉద్యోగాలు లేక ఆత్మహత్యలు చెసుకునే పరిస్థితి తీసుకువచ్చారని వారి కుటుంబం రైతు బంధు లాంటి పథకాలతో దోచుకోవడం దాచుకోవడానికి సరిపోయిందని తెలిపారు.

జిల్లేల మరియు చిప్పపల్లీ లాంటి మిడ్ మానేరు ప్రాజెక్ట్ కింద గ్రామాల్లో ఉన్న వారినుండి గల్ఫ్ వెళ్ళాట్లేదని గప్పాలు కోరుతున్న కేటీఆర్ కు దమ్ముంటే అవే గ్రామాలకు కలిసి వెళ్దామని ఎంతమంది గల్ఫ్ బాట పడుతున్నారో చూపిస్తామని సవాలు విసిరారు.
గల్ఫ్ కార్మికుల సంక్షేమం పై నిర్లక్ష్యం వహించిన కేటీఆర్ కు తమ ఓట్లతో బుద్ధి చేపుతమని తెలిపారు.
ఈ ర్యాలీలో గల్ఫ్ బాధిత కుటుంబాలతో పాటు GWAC సంస్థ ఉపాధ్యక్షులు వంశీ గౌడ్, తెలంగాణ గౌరవ సలహాదారులు దేవాన్న బీజిలి, జగిత్యాల జిల్లా అద్యక్షులు సత్యం గౌడ్ గొల్లపల్లి, కువైట్ శాఖ ప్రధాన సలహాదారుల జంగం చార్లీ, అర్మూర్ మండల అధ్యక్షులు వసంత్ రెడ్డి, అన్ని జిల్లాల కమిటీలు మరియు సిరిసిల్ల నియోజక వర్గ ప్రజలు పాల్గొన్నారు.