సిరిసిల్ల న్యూస్: సిరిసిల్ల నియోజకవర్గం
రాజన్నసిరిసిల్ల జిల్లా సిరిసిల్ల నియోజకవర్గంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా కేటీఆర్ గురువారం నామీనేషన్ దాఖలు చేశారు. ఎలాంటి ర్యాలీ లేకుండా.. సాధా సీదాగా వచ్చి కేటీఆర్ నామీనేషన్ వేశారు. అంతకు ముందు సిరిసిల్ల పట్టణంలోని నేతన్న విగ్రహం, అంబేద్కర్, గాంధీ, కొండా లక్ష్మన్ బాపూజీ, సర్ధార్ సర్వాయి పాపన్న విగ్రహాలకు పూలమాలలు వేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య, మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళచక్రపాణి, తెలంగాణ ఉద్యమకారుడు బాలయ్య, వీర్నపల్లి జడ్పీటీసీ గుగులోత్ కళావతి పాల్గొన్నారు.

