బలగం టివి: రాజన్న సిరిసిల్ల:
సిరిసిల్ల పట్టణంలోని వెంకంపేట, పద్మనగర్ మొదలగు ప్రాంతాల మీదగా ప్రవహించే (ఉదర వాగు కాలువ) ప్రధాన మురికి నీటి కాలువ నిర్మాణ పనులను పరిశీలించిన గౌరవ పురపాలక సంఘ అధ్యక్షురాలు జిందం కళాచక్రపాణి
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శాసనసభ్యులు కల్వకుంట్ల తారక రామారావు గారు తెలంగాణ తొలి ముఖ్యమంత్రివర్యులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారి సహకారంతో దాదాపు 6 కోట్ల పైచిలుకు రూపాయల ప్రత్యేక నిధులతో వరద నీటి ప్రవాహం మరియు ప్రజల నిత్య అవసరాల వల్ల వెలువడే మురికి నీటి ప్రవాహం వల్ల ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఏర్పడకూడదని శిథిలావస్థకు చేరుకున్న ఈ ఉదర కాలువ పునర్నిర్మాణ పనులు చేపట్టడం జరిగిందని అన్నారు..ఉదరకాలువ పునర్నిర్మాణ పనుల్లో అలసత్వం వహించకుండా నాణ్యత ప్రమాణాలను పాటిస్తూ పనులు త్వరితగతిన పూర్తిచేసేల చూడాలని సంబంధిత అధికారులను ఆదేశిస్తూ అక్కడి ప్రజలతో పురపాలక సంఘం సేవలకు సంబంధించిన పలువిషయాలపై మాట్లాడడం జరిగింది..
వీరి వెంట మున్సిపల్ కమిషనర్ మీర్జా ఫసహత్ అలీ బేగ్ గారు, కౌన్సిలర్ సభ్యులు దిద్ది మాధవి రాజుగారు, గూడూరి భాస్కర్ గారు, డి.ఈ ప్రసాద్ గారు ఏ.ఈ నరసింహస్వామి గారు, మున్సిపల్ అధికారులు మరియు సిబ్బంది ఉన్నారు.
