బలగం టివి, ముస్తాబాద్
రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం పోతుగల్ గ్రామానికి చెందిన కీ,శే, గాలిగాని దినేష్, కీ,శే,జంగ శ్రీనివాస్ జ్ఞాపకార్థంగా గ్రామ యువత ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది.
సంక్రాంతి పర్వదినం సందర్భంగా జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభమై గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని ఫైనల్ మ్యాచ్ గ్రామంలో జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాల మైదానంలో నిర్వహించారు.ఈ పోటీలో సిరిసిల్ల షాదాబ్-11 జట్టు విజయం సాధించగా ఆవునూరు గ్రామం యువటీం రన్నర్ గా నిలిచారు. గెలుపొందిన జుట్టుకు 10116/-అలాగే ఓడిన జుట్టుకు 6666/-నగదు రూపాయలు బహుమానంగా ఇవ్వడం జరిగింది.ఈ సమావేశంలో ముస్తాబాద్ ఎంపీటీసీ గుండెల్లి శ్రీనివాస్ గౌడ్,ఆవునూరు క్రాంతి,కోల కృష్ణగౌడ్,అభి, రాజు,దినేష్,ధర్మేంధర్, ఆర్గనైజేర్లు ఆది శేఖర్,జంగ నారాయణ,బాలకిషన్,వినయ్ వివిధ గ్రామాలకు చెందిన యువకులు తదితరులు పాల్గొన్నారు.